దీపావళి(Deepawali festival) పండుగ వేళ ఆ కుటుంబంలో చీకట్లు చిమ్ముకున్నాయి.

దీపావళి(Deepawali festival) పండుగ వేళ ఆ కుటుంబంలో చీకట్లు చిమ్ముకున్నాయి. కొందరు యువకులు(Youth) నరకాసురుడు లా ప్రవర్తించారు. బాణాసంచా(crackers) కాల్చ వద్దు అని అన్నందుకు ఒక వృ ద్దుడిని(elder man) చంపేశారు. కొందరు యువకులు అర్ధరాత్రి తర్వాత మళ్లీ క్రాకర్స్‌ కాల్చడంపై వృద్దుడు మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు అతడిని కొట్టి చంపారు. చంపిన తర్వాత అక్కడినుంచి పారిపోయారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. హర్యానాలోని(Haryana) ఫరీదాబాద్‌లో(Faridabad) ఈ దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా ఫరీదాబాద్ సెక్టార్ 18లోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు ఒక ఇంటి ముందు బాణసంచా కాల్చారు. పెద్ద వయసున్న వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ జరిగింది. అర్ధరాత్రి తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు మళ్లీ ఆ ఇంటి ముందు టపాసులు పేల్చారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన వృద్ధుడు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఆ వృద్ధుడ్ని కొట్టారు. జోక్యం చేసుకున్న అతడి కుమారుడు, కోడలి పై కూడా చెయ్యి చేసుకున్నారు. ఆ వ్యక్తులు కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ వృద్ధుడు మరణించాడు. దీంతో అతడి కుమారుడు వినోద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు రాజు, ధీరజ్, నందు కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story