రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మొదటి భూకంపం ఉదయం 4.09 గంటలకు 4.4 తీవ్ర‌త‌తో సంభవించింది.

రాజస్థాన్(Rajasthan) రాజధాని జైపూర్‌(Jaipur)లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడుసార్లు భూకంపం(Earth Quake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) ప్రకారం.. మొదటి భూకంపం ఉదయం 4.09 గంటలకు 4.4 తీవ్ర‌త‌తో సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉంది. రెండ‌వ భూకంపం తెల్లవారుజామున 4:22 గంటలకు 3.1 తీవ్రతతో, మూడ‌వ‌సారి ప్ర‌కంప‌న‌లు 4:25 గంటలకు 3.4 తీవ్రతతో సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదిక లేదు.

భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు వచ్చారు. జైపూర్‌లో బలమైన భూకంపం వచ్చినట్లు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే(Vasundhara Raje) ట్వీట్ చేశారు. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నానని ట్వీట్‌(Tweet)లో పేర్కొన్నారు.

మణిపూర్‌(Manipur)లోని ఉఖ్రుల్‌(Ukhrul)లో శుక్రవారం ఉద‌యం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు(Richter Scale)పై 3.5గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు తీశారు. భూకంపం కార‌ణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ న‌ష్టానికి సంబంధించిన నివేదిక‌లు లేవు.

Updated On 20 July 2023 9:02 PM GMT
Yagnik

Yagnik

Next Story