అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 508 స్టేషన్లను ఏకకాలంలో పునరుద్ధరించే ఈ పథకానికి సంబంధించి స్టేషన్లలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అమృత్ భారత్ స్టేషన్(Amrit Bharat Station) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 508 స్టేషన్లను ఏకకాలంలో పునరుద్ధరించే ఈ పథకానికి సంబంధించి స్టేషన్లలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు, ఆ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శోభన్ చౌదరి(Shoban Choudhray) ప్రకారం.. భారత రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద, రద్దీగా ఉండే రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలోని వేలాది నగరాలు, పట్టణాలను కలుపుతూ లక్షలాది ప్రజలకు ముఖ్యమైన రవాణా మార్గాలను అందిస్తుంది. భారతీయ రైల్వే ఆధునీకరణ ప్రక్రియ గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతోంది. దీని కింద మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలో రైల్వే స్టేషన్లను పునరుద్ధరించడం, కొత్త రైల్వే లైన్లు వేయడం, 100 శాతం విద్యుదీకరణ, ఆస్తుల భద్రతను మెరుగుపరచడం వంటి అనేక రకాల కార్యకలాపాలు ఉన్నాయన్నారు.
ప్రధాన మంత్రి భారతదేశం అంతటా 'అమృత్ భారత్ స్టేషన్ యోజన'ను ప్రారంభించి.. 508 స్టేషన్ల పునరాభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
ఏపీ(Andhra Pradesh)లో అమృత్ భారత్ కింద రూ.453.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు(Kurnool), తుని(Tuni), తెనాలి(Tenali), అనకాపల్లి(Anakapalli), విజయనగరం(VIjayanagaram), తాడేపల్లిగూడెం(Thadepalligudem)), సింగరాయకొండ(Singarayakonda), నిడదవోలు(Nidadavolu), దొనకొండ(Donakonda), దువ్వాడ(Duvvada), నరసాపురం(Narasapuram), రేపల్లె(Repalle), పిడుగురాళ్ల(Piduguralla), పలాస(Palasa), ఏలూరు(Eluru), కాకినాడ టౌన్(Kakinada Town), భీమవరం(Bheemavaram), ఒంగోలు(Ongole) రైల్వే స్టేషన్ల(Railway Stations)కు కేంద్ర నిధులతో కొత్త హంగులు సమకూరనున్నాయి.
రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వ్యయం రూ.24,470 కోట్లు అవుతుందని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మంత్రి పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయనున్న రైల్వే స్టేషన్లలో ఉత్తరప్రదేశ్(55), రాజస్థాన్‌లలో(55), బీహార్‌లో (49), మహారాష్ట్రలో (44), పశ్చిమ బెంగాల్‌లో (37), మధ్యప్రదేశ్‌లో (34), అస్సాంలో (32), ఒడిశాలో (25), పంజాబ్(22), గుజరాత్(22), తెలంగాణల్లో (22), జార్ఖండ్‌లో (20), ఆంధ్రప్రదేశ్(18), తమిళనాడులో (18), హర్యానాలో (15), కర్ణాటకలో (13) చొప్పున ఉన్నాయి.