ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) క్రేజ్‌ అంతా ఇంతా కాదు..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. ఆయనిప్పుడు జాతీయ నాయకుడు. బీజేపీ(BJP) అధినాయకత్వానికి దగ్గర మనిషి. ఇక కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో విషయానికి వస్తే అది కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన కార్యక్రమం. దీనికి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కేబీసీ(KBC) సక్సెసయ్యిందంటే అమితాబ్‌(Amitabh bachchan) వల్లనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కేబీసీ 16వ సీజన్‌ కొనసాగుతున్నది. ఇందులో ప్రతి ప్రశ్నకు అమౌంట్‌ పెరుగుతూ పోతుంది. పాల్గొనే కంటెస్టెంట్లను బట్టి అమితాబ్‌ ప్రశ్నలు అడుగుతుంటారు. శుక్రవారంనాటి కార్యక్రమంలో వృద్ధ దంపతులు హాట్‌సీట్‌లో కూర్చున్నారు. 80 వేల రూపాయల ప్రశ్న వరకు ఆ దంపతులు బాగానే జవాబులు ఇచ్చారు. అయితే ఆ తర్వాత అమితాబ్‌ అడిగిన ప్రశ్నే వారిని కాసింత తికమక పెట్టింది. అయోమయానికి గురయ్యారు. దాంతో లైఫ్‌లైన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ ప్రశ్నకు జవాబు చెబితే ఆ వృద్ధ దంపతులు లక్షా 60 వేల రూపాయలు గెల్చుకుంటారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే... 2024 జూన్‍లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు ఎవరు? అని! దానికి పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే ఆప్షన్లను ఇచ్చారు. పాపం వారికి ఈ ప్రశ్నకు జవాబు తెలియదు. అందుకే ఆడియన్స్‌ పోల్‌కు వెళ్లారు. అందులో 50 శాతానికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని అడియన్స్‌ పోల్‌ చేశారు. ఆ వృద్ధ దంపతులు కూడా అదే ఆప్షన్‌కు వెళ్లారు. దీంతో వారు లక్షా 60 వేల రూపాయల ప్రశ్నను అధిగమించారు. తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ వారికి పవన్‌ కల్యాణ్‌ గురించి బ్రీఫ్‌గా చెప్పారు. 'పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు. చిరంజీవి(Chiranjeevi) ఉన్నారు కదా.. ఆయనకు ఇతను చిన్న తమ్ముడు అవుతాడు. ఆయన జనసేన పార్టీ పెట్టాడు.. ఈ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు' అంటూ వారికి వివరించాడు. కేబీసీలో పవన్ కల్యాణ్‍పై వచ్చిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ వీడియోను బాగా షేర్‌ చేస్తున్నారు.

Updated On 14 Sep 2024 6:56 AM GMT
Eha Tv

Eha Tv

Next Story