కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ద్వారకా జిల్లాలోని ఓఖాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ (NACP) శాశ్వత క్యాంపస్‌కు అమిత్‌ షా శనివారం శంకుస్థాపన చేయనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ద్వారకా జిల్లాలోని ఓఖాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ (NACP) శాశ్వత క్యాంపస్‌కు అమిత్‌ షా శనివారం శంకుస్థాపన చేయనున్నారు.

ఎన్ఏసీపీ దేశంలో మొట్టమొదటి జాతీయ అకాడమీ. తీరప్రాంతాన్ని సమర్థవంతంగా రక్షించడానికి పోలీసు బలగాలకు శిక్షణనిస్తుంది. 2018 నుంచి గుజరాత్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో పనిచేయడం ప్రారంభించింది. సరిహద్దు భద్రతా దళం (BSF) గుజరాత్ ఫ్రాంటియర్.. మే 19న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర పోలీసులకు ఇంటెన్సివ్, అత్యున్నత స్థాయి శిక్షణ అందించడానికి ఎన్ఏసీపీ ఏర్పాటు చేయబడిందని పేర్కొంది.

రూ.164 కోట్ల వ్యయంతో కచ్ జిల్లాలో మేడి, జఖౌ మధ్య నిర్మిస్తున్న 18 ఔట్‌పోస్టులలో ఐదు తీరప్రాంత అవుట్‌పోస్టులను అమిత్ షా ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లో 20, 21 తేదీల్లో జ‌రిగే నాలుగు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటారు. బోరిజ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పిల్లలకు క్రీడా సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి షా హాజరవుతారని అధికారులు తెలిపారు. గాంధీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ‌డంతో పాటు గాంధీనగర్ (నార్త్) అసెంబ్లీ స్థానంలో ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్‌కు కూడా హాజరవుతారు.

ఆదివారం అమిత్ షా 320 స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులను ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లోని అమ్‌ఫెడ్ డెయిరీకి చెందిన‌ ఆధునిక బయోలాజికల్ టెస్టింగ్ లేబొరేటరీని ప్రారంభించ‌నున్నారు. అహ్మదాబాద్ నగరంలోని నారన్‌పురా వార్డులో వ్యాయామశాల, లైబ్రరీ, అహ్మదాబాద్‌లోని ఛరోడి గ్రామంలో పునర్నిర్మించిన సరస్సును కూడా ప్రారంభిస్తానున్నారు.

Updated On 20 May 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story