త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ప్ర‌చారం కోసం కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) శుక్రవారం కర్ణాటక చేరుకున్నారు. ధార్వాడ్‌(Dharwad)లోని నవలగుండ్‌(Navalgund)లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే(Kharge).. మోదీ(Modi)ని పాముతో పోలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లకు మ‌తి చెడింది..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ప్ర‌చారం కోసం కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) శుక్రవారం కర్ణాటక చేరుకున్నారు. ధార్వాడ్‌(Dharwad)లోని నవలగుండ్‌(Navalgund)లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే(Kharge).. మోదీ(Modi)ని పాముతో పోలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లకు మ‌తి చెడింది.. మోదీని ఎంత తిడితే కమలం అంత బాగా వికసిస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ తన ఒడిలో పసిపాపలా ఆర్టికల్ 370ని మభ్యపెట్టిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ, మమత ఇలా అందరూ ఆర్టికల్ 370ని తొలగించకండి.. కాశ్మీర్‌(Kashmir)లో రక్తపు నదులు ప్రవహిస్తాయన్నారు. ఆర్టికల్ 370 తొలగించబడింది.. రక్తపు నదులను పక్కన పెట్టండి, ఎవరూ గులకరాయిని విసిరేందుకు కూడా సాహసించలేదని అన్నారు.

అమిత్‌ షా మాట్లాడుతూ.. “కాంగ్రెస్ నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేను భయపడను. పీఎఫ్‌ఐని నిషేధించడం ద్వారా కర్ణాటకను కాపాడుకున్నాం. మీకేమైనా అభ్యంతరం ఉంటే వచ్చి పీఎఫ్‌ఐని ఎందుకు కొనసాగించాలో చెప్పండి. ఓటు బ్యాంకు ఆశతో కాంగ్రెస్‌ పీఎఫ్‌ఐని తలపై పెట్టుకుందని అన్నారు. ఒకవైపు రాహుల్ బాబా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఉందని షా అన్నారు. మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లపాటు కర్ణాటక(Karnataka)ను ముందుకు తీసుకెళ్తుందా లేక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను వెనక్కు తీసుకెళ్తుందా అని తేల్చే ఎన్నికలే ఈ ఎన్నికలు అని అమిత్ షా అన్నారు.

మరోవైపు మధుగిరిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ పరంగా సరికాదన్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే లింగాయత్, ఎస్సీ, వొకలింగ ఎవరి రిజర్వేషన్ తీసుకుంటారు? అని ప్ర‌శ్నించారు. ఇవి కర్నాటక భవిష్యత్‌ ఎన్నికలు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. సరైన ఫలితాలను పొందుతారు. డబుల్ ఇంజిన్ అంటే.. మోదీ జీ పంపిన విధానాలను యడియూరప్ప, బొమ్మై జీ అమలు చేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటారని న‌డ్డా పేర్కొన్నారు.

Updated On 28 April 2023 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story