రాజ్యాంగ నిర్మాతపై హోంమంత్రి అమిత్ షా వాక్యాలు అర్థరహితం.అంబేద్కర్ పై చేసిన వాక్యాలను అమిత్ షా ఉపసంహరించుకోవాలి.
రాజ్యాంగ నిర్మాతపై హోంమంత్రి అమిత్ షా వాక్యాలు అర్థరహితం.అంబేద్కర్ పై చేసిన వాక్యాలను అమిత్ షా ఉపసంహరించుకోవాలి.
భారత రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేద్కర్ పై నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అత్యున్నత పదవిలో ఉండి అంబేద్కర్ ని అవమానించె విధంగా మాట్లాడడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు
అంబేద్కర్ ఒక వ్యక్తి కానీ కాదని, భారత సమాజం సంపదని, అనగారిన వర్గాల కు ఆత్మగౌరవ ప్రతిక అని, అలాంటి మహానీయుడు పైన సాక్షాత్తు పార్లమెంటులో అమిత్ షా గారు చాలా చులకనగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే చాయ్ వాల నుండి భారత ప్రధాని మంత్రి కాగలిగానని గొప్పగా చెబుతుంటే, ఇందుకు విరుద్ధంగా అమిత్ షా గారు మాట్లాడడం కోట్లాదిమంది ప్రజల హృదయాలను కలిచి వేసిందని ఆయన అన్నారు
ఇప్పటికైనా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు పట్టింపులకు పోకుండా భారత రాజ్యాంగం పట్ల కాని, అంబేద్కర్ పట్ల కాని తనకు ఏమాత్రం గౌరవం ఉన్న బేషరతుగా తన వాక్యలను ఉపసహచుకొవాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే
భారత సమాజానికి కూడా క్షమాపణలు చెప్పి తన గౌరవాన్ని కాపాడుకోవాలని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు లేదంటే దేశవ్యాప్తంగా జరిగుతున్న ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఆయన హెచ్చరించారు.