రాజ‌స్థాన్‌(Rajasthan)లోని భరత్‌పూర్‌(Bharatpur)లో శనివారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah).. ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్(Sachin Pilot) నెంబ‌ర్‌ రాదని..

రాజ‌స్థాన్‌(Rajasthan)లోని భరత్‌పూర్‌(Bharatpur)లో శనివారం జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah).. ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్(Sachin Pilot) నెంబ‌ర్‌ రాదని.. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. నేడు 4 జిల్లాలు, 19 అసెంబ్లీల నుంచి 24 వేల మందికి పైగా కార్యకర్తలు ఇక్కడకు హాజరయ్యారని తెలిపారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ నేతలు హమ్‌ దో-హమారే దో అంటూ పార్లమెంట్‌లో తిట్టేవారు.. ఎందుకంటే మనకు అప్పుడు ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు. కానీ నేడు ఆ కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)కి లోక్ సభ ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కడం లేదు. మన బూత్ కార్యకర్తల శ్రమ, ధైర్యసాహసాల వల్లే బీజేపీకు ఇంతటి పేరు ప్రఖ్యాతులు, విస్తరణ వచ్చిందన్నారు. నాయకుల ప్రాతిపదికన ఏ పార్టీ అయినా నడుస్తుందని, అయితే మన పార్టీ విజయం సాధిస్తే అది బూత్ వద్ద నిలబడిన మన పార్టీ కార్యకర్తలదే విజయమని అన్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పుడే రాహుల్ బాబా కాలినడకన దేశమంతా తిరిగారని, ఆయన మంచి పని చేశారని, అయితే దీని ఫలితం ఏంటని విలేకరుల సమావేశంలో విలేకరులు నన్ను అడిగారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈశాన్యంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా అక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ ద్వారా ప్రజల ఆకాంక్షలను మోదీ జీ నెరవేర్చారని, భారతదేశాన్ని సురక్షితంగా మార్చారని, పేదల సంక్షేమం సూత్రాన్ని అమలు చేశారని అమిత్ షా అన్నారు. ఫలితంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం బీజేపీదే. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రజలకు ఉచితంగా టీకాలు వేయించారని, కరోనా నుంచి దేశాన్ని రక్షించే పని చేశారని అన్నారు.

అశోక్‌ గెహ్లాట్, స‌చిన్‌ పైలట్ ఇద్దరూ అధికారం కోసం పోరాడుతున్నారని అమిత్ షా అన్నారు. గెహ్లాట్ జీ అధికారం నుండి వైదొలగాలని కోరుకోరు. పైలట్ జీ కావాలని కోరుకుంటారు. ఇద్దరు నాయకులూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కానీ ఇక్క‌డ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పైలట్ జీ, మీరు ఏమి చేసినా మీ నెంబ‌ర్ రాదని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ(Narendra Modi) కృషి ఆధారంగానే ఎన్నికలకు వెళ్తున్నామని, రాజస్థాన్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 2024లో 25కి 25 ఎంపీ సీట్లు సాధించడం ఖాయమని ఆయన అన్నారు.

Updated On 16 April 2023 4:58 AM GMT
Yagnik

Yagnik

Next Story