70 ఏళ్లుగా అన్యాయానికి గురైన, అవమానించబడిన, విస్మరించబడిన వారికి న్యాయం చేసేందుకు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ చట్టం-2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2023 లను తీసుకొచ్చామని ఆయన అన్నారు. కశ్మీర్ చరిత్రపై చర్చ సమయంలో అమిత్ షా కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్లు నిర్వాసితులై.. వారు తమ దేశంలోనే శరణార్థులుగా మారవలసి వచ్చిందని అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల(Parliament Winter Sessions) రెండో రోజైన మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2023 లను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023పై హోంమంత్రి ఈరోజు లోక్‌సభలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
70 ఏళ్లుగా అన్యాయానికి గురైన, అవమానించబడిన, విస్మరించబడిన వారికి న్యాయం చేసేందుకు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ చట్టం-2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2023 లను తీసుకొచ్చామని ఆయన అన్నారు. కశ్మీర్ చరిత్రపై చర్చ సమయంలో అమిత్ షా కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్లు నిర్వాసితులై.. వారు తమ దేశంలోనే శరణార్థులుగా మారవలసి వచ్చిందని అన్నారు. నేటి లెక్కల ప్రకారం.. 46,631 కుటుంబాలు, 1,57,967 మంది తమ స్వంత దేశంలోనే నిర్వాసితులయ్యారు. వారి మూలాలను వారి దేశం, రాష్ట్రం నుండి వేరుచేసే విధంగా నిర్వాసితులయ్యారు. ఈ బిల్లు వారికి హక్కులు కల్పించడం, వారికి ప్రాతినిధ్యం కల్పించడం కోసమేనన్నారు. మోదీ కాశ్మీరీల వాయిస్ విన్నారు, వారి హక్కులు వారు ఈ రోజు పొందారని పేర్కొన్నారు.
భారత్-పాకిస్తాన్ యుద్ధం మరియు ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ.. "కాశ్మీర్‌లో మూడు యుద్ధాలు జరిగాయి. 1947లో పాకిస్తాన్ కాశ్మీర్‌పై దాడి చేసింది; ఈ సమయంలో 31,000 కంటే ఎక్కువ కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. 1965, 1971లో జరిగిన యుద్ధాల్లో 10,065 కుటుంబాలు నిర్వాసితులవడం గమనార్హం. 1947, 1965, 1969లో జరిగిన ఈ మూడు యుద్ధాల్లో మొత్తం 41,844 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ బిల్లు ఆ వ్యక్తులకు హక్కులు కల్పించడానికి, ఆ ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం అని వివరించారు.
ఉగ్రవాదం ఘటనలను ప్రస్తావిస్తూ.. 1994 నుంచి 2004 మధ్య మొత్తం 40,164 ఘటనలు జరిగాయి. 2004-14 సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో 7,217 ఘటనలు జరిగాయి. 2014 నుంచి 2023 వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 70 శాతంతో కేవలం 2,000 ఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయన్నారు.