కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) మణిపూర్‌లోని(Manipur) హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ఇంఫాల్(Imphal) చేరుకున్నారు. రాహుల్ గాంధీ మణిపూర్‌లో రెండు రోజులు పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ హింసాత్మక పట్టణాలతో పాటు సహాయక శిబిరాలను సందర్శిస్తారు.

కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) మణిపూర్‌లోని(Manipur) హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ఇంఫాల్(Imphal) చేరుకున్నారు. రాహుల్ గాంధీ మణిపూర్‌లో రెండు రోజులు పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ హింసాత్మక పట్టణాలతో పాటు సహాయక శిబిరాలను సందర్శిస్తారు. ఇంఫాల్, చురచంద్‌పూర్‌లోని పౌర సమాజ ప్రతినిధులతో సంభాషించున్నారు. అయితే రాహుల్ ప‌ర్య‌ట‌న‌పై బీజేపీ(BJP) నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇప్ప‌టికే రాహుల్ గాంధీపై పోస్ట్ చేసినందుకు బుధ‌వారం అమిత్ మాల్వియాపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

అయిన‌ప్ప‌టికీ అమిత్ మాల్వియా(Amit Malviya) త‌గ్గ‌లేదు. మ‌రోమారు ట్విట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేశారు. అమిత్ మాల్వియా ట్విట‌ర్‌లో.. రాహుల్ గాంధీని హేళన చేస్తూ.. రాహుల్ గాంధీ శాంతి దూత కాదు.. రాజకీయ దూత మాత్రమేనని అన్నారు. వారు ఈ విష‌యాన్ని మ‌రిగించాల‌ని కోరుకునే అవకాశవాదులని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదన్నారు. గాంధీ పర్యటన "స్వప్రయోజన రాజకీయ ఎజెండా" నుండి పుట్టిందని మాల్వియా అన్నారు. అమిత్ మాల్వియా ట్వీట్ల‌పై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.

Updated On 29 Jun 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story