మహారాష్ట్రలోని(Maharashtra) సింధుదుర్గ్‌ జిల్లా సోనుర్లి గ్రామం సమీపాన దారుణం చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని(Maharashtra) సింధుదుర్గ్‌ జిల్లా సోనుర్లి గ్రామం సమీపాన దారుణం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో(Forest) ఓ మహిళ గొలుసులతో(Tied) బంధించి ఉండడం చూసిన గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారం ఆధారాంగా బాధితురాలిని పోలీసులు రక్షించి గోవా మెడికల్‌ కాలేజ్‌కు(Goa Medicle College) తరలించారు. బాధితురాలి దగ్గర అమెరికా పాస్‌పోర్ట్(american Passport) ఫోటోకాపీ, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్‌, ఇతర పత్రాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గొర్రెలను మేపేందుకు అడవిలోకి వెళ్లిన వ్యక్తికి ఈ మహిళ అరుపులు వినిపించడంతో అటు వైపు వెళ్లగా మహిళను గొలుసులతో బంధించి ఉండడం చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి కాపాడారు. బాధితురాలి పేరు లలితా కయి అని, వయసు 50 ఏళ్లని పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. చిక్కిశల్యమై పోయి ఉంది. బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడిందని, వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితురాలు చాలా నీరసించిపోయినందును ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేకపోతుందన్నారు. ఆమె గత పదేళ్లుగా ఇండియాలో ఉంటోందని, అమెరికా వీసా గడువు ముగిసిందని పోలీసులు గుర్తించారు. భర్తే అడవిలో బంధించి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె బంధువులను, కుటుంబసభ్యుల కోసం తమిళనాడుకు బృందాలను పంపిస్తున్నామని తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story