Powerful Countries 2024 : ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీస్ ఇవే.. 'భారత్' స్థానం ఎంతంటే..!
2024 US న్యూస్ పవర్ ర్యాంకింగ్స్(Rankings) ప్రకారం, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా(Powerfull country) అమెరికా(America) మరోసారి నిలిచింది. అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. టెక్నాలజీ, ఫైనాన్స్‌లో ముందున్న ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలో రెండో అత్యంత శక్తివంతమైన దేశంగా చైనా(China) ఆవిర్భవించింది.

నాయకత్వం, ఆర్థిక, రాజకీయ ప్రభావం, అంతర్జాతీయ సంబంధాలు, సైనిక బలం ఆధారంగా ఈ ర్యాంకులు వెల్లడిస్తారు.
సాంకేతికత, ఫైనాన్స్, వినోదం వంటి వివిధ రంగాలలో బలంగా ఉన్న అమెరికా తన ఆధిక్యాన్ని నిలుపుకున్నప్పటికీ, AI మరియు 5Gలలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అమెరికాతో చైనా పోటీ పడుతోంది. .
భౌగోళిక రాజకీయ ప్రభావం, సైనిక శక్తికి ప్రసిద్ధి చెందిన రష్యా(Russia), ప్రపంచ వ్యవహారాలను రూపొందించడంలో తన పాత్రను పోషిస్తూ మూడో స్థానాన్ని రష్యా నిలబెట్టుకుంది. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఛాంపియన్ అయిన జర్మనీ నాలుగో స్థానంలో ఉంది. నిరంతర ఆర్థిక బలం, సాంకేతిక లక్ష్యాల్లో ముందుండే యూకే ఐదో స్థానంలో నిలిచింది. తర్వాత ఆరో స్థానంలో దక్షిణకొరియా(South Korea) దక్కించుకుంది. డిజిటలైజేషన్, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తూ ఫ్రాన్స్ ఏడో స్థానాన్ని పొందింది.
అధునాతన చిప్ తయారీ, AI, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీకి పేరుగాంచిన జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక అమెరికాకు మిత్రదేశం, ఆ దేశానికి ప్రధాన చమురు ఉత్పత్తిదారైన సౌదీ అరేబియా(Saudi arabia) తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఇక 10వ స్థానంలో మరో ప్రధాన చమురు దేశమైన UAE నిలిచి తన ఆర్థిక పటిష్టతను చాటింది.
ఇక భారత్(India) విషయానికొస్తే.. ప్రపంచంలో అత్యంతశక్తివంతమైన దేశంగా 12వ స్థానంలో భారత్ నిలిచింది. జీడీపీ పరంగా ఐదో స్థానంలో ఉన్నప్పటికీ శక్తవంతమైన దేశాల ర్యాంకింగ్స్ వచ్చేటప్పటికి భారత్‌కు 12వ స్థానం దక్కింది. జీడీపీలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీలే భారత్ కంటే ముందున్నాయి.