ఇంటర్నెట్ సౌకర్యం లో కొత్త టెక్నాలజీ వస్తున్నప్పటికీ ఇప్పటికి సిగ్నల్స్ కూడా నోచుకోని మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి . గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు . ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందించేదిశలో టెక్ సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి . .

ఇంటర్నెట్ సౌకర్యం లో కొత్త టెక్నాలజీ వస్తున్నప్పటికీ ఇప్పటికి సిగ్నల్స్ కూడా నోచుకోని మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి . గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు . ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందించేదిశలో టెక్ సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి . . ఇప్పటికే SpaceX బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌ శాటిలైట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌ను ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడే ఇదే క్రమంలో అమెజాన్ సైతం శాటిలైట్ ఇంటర్నెట్‌ యూనిట్ ప్రాజెక్ట్ అయిన కైపర్ (Kuiper) ద్వారా 2024 నాటి కల్లా శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించాలని డిసైడ్ అయింది.

వాషింగ్టన్‌లో జరిగిన ఓ సదస్సులో బీటా టెస్టింగ్ ఫేజ్‌తో ప్రారంభించి 2024లో కమర్షియల్ కస్టమర్‌లతో కంపెనీ తమ శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించే దిశగా అమెజాన్ సిద్ధమవుతుందని తెలిపారు . శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి అమెజాన్ తన కైపర్ నెట్‌వర్క్‌లో 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది.అమెజాన్ కంపెనీ తన కైపర్ ఉపగ్రహాలతో యూజర్లను కనెక్ట్ చేయడానికి మూడు విభిన్న రకాల టెర్మినల్స్‌ను ఆవిష్కరించింది. ప్రామాణిక కస్టమర్ టెర్మినల్ (Standard Customer Terminal) అనేది 11-అంగుళాల చదరపు యాంటెన్నా. ఇది సెకనుకు 400MB వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 400 డాలర్ల కంటే తక్కువ ఖర్చుతోనే దీనిని కంపెనీ తయారు చేయటానికి ప్రయత్నాలు చేపట్టింది .

SpaceX వంటి భారీ కంపెనీ లకే సవాల్ విసిరేలా అమెజాన్ రూపొందించబోతున్న ఈ ప్రాజెక్ట్ వలన ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రదేశాలు ఇక ఉండబోవుచ్చు . మారుమూల ప్రాంతాల్లో కూడా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ వేగం తో సౌకర్యాలు పొందవచ్చు . అమెజాన్ తన శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ కోసం దాని అత్యంత తక్కువ టెర్మినల్‌గా చిన్న, తేలికపాటి మొబైల్ యాంటెన్నాను కూడా ఆఫర్ చెయ్యనుంది. ఈ టెర్మినల్ ధరను కంపెనీ ఇంకా బయటపెట్టలేదు . సెకనుకు 1 గిగాబిట్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగల పెద్ద యాంటెన్నాను కూడా కంపెనీ తీసుకురానుంది. ఈ టెర్మినల్ దాదాపు 30 సెకన్లలో HD ఫీచర్-లెంగ్త్ మూవీని డౌన్‌లోడ్ చేయగలదు.

Updated On 16 March 2023 4:51 AM GMT
Ehatv

Ehatv

Next Story