అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra)కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్(Jammu & Kashmir)లో జులై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు సాగే ఈ యాత్రం కోసం భక్తులు రెడీ అవుతున్నారు. ఈ రోజ నుంచి యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయ్యింది. అనంతనాగ్ జిల్లా(Anantnag District)లోన పహల్గాం ట్రాక్(Phalgun Track), గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆఫ్ లైన్, ఆన్‌లైన్ ద్వారా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra)కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్(Jammu & Kashmir)లో జులై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు సాగే ఈ యాత్రం కోసం భక్తులు రెడీ అవుతున్నారు. ఈ రోజ నుంచి యాత్రలో పాల్గొనే భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయ్యింది. అనంతనాగ్ జిల్లా(Anantnag District)లోన పహల్గాం ట్రాక్(Phalgun Track), గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ ట్రాక్‌లకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆఫ్ లైన్, ఆన్‌లైన్ ద్వారా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. యాత్రలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి వేలి ముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనేవారు 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మెడికల్ సర్టిఫికెట్‌ను పొందుపర్చాలి. ఆరు వారాలకు పైబడిన గర్భిణీలకు మాత్రం అనుమతి లేదు. రిస్క్‌తో కూడిన యాత్ర అయినప్పటికీ అమర్‌నాథ్‌ను దర్శించుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు. గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఉండేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.