మనకు ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు(Holi Festival) ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి(Amalaka Ekadashi) అంటారు. కొందరు అమలకి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉసిరి చెట్టుకు(Amla tree) పూజలు చేస్తే చాలా మంచిది. మహా విష్ణువు ఈ రోజున ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.

Amalaka Ekadashi
మనకు ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు(Holi Festival) ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి(Amalaka Ekadashi) అంటారు. కొందరు అమలకి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉసిరి చెట్టుకు(Amla tree) పూజలు చేస్తే చాలా మంచిది. మహా విష్ణువు ఈ రోజున ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి, కుబేరుడు కూడా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారట! రాధా కృష్ణులు(Radha Krishna) కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజునే ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుకున్నారట! ఈ పండుగ రోజుకు ఓ పరమార్థం ఉంది. పూర్వం చిత్రసేనుడు అనే రాజు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయనతో పాటుగా రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఓసారి వేట కోసం అడవికి వెళ్లిన చిత్రసేనుడు(Chitrasenudu) దారితప్పి రాక్షసుల చేతిలో చిక్కుకున్నాడు. వారు చిత్రసేనుడిని బంధించి తమ స్థావరానికి తీసుకెళతారు. స్పృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి శరీరం నుంచి ఓ కాంతి పుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులను హతమారుస్తుది. కాసేపటికి మెలకువలోకి వచ్చిన చిత్రసేనుడు తన చూట్టూ పడి ఉన్న రాక్షసుల మృతదేహాలను చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతమే నీ ప్రాణాలను కాపాడింది అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న ప్రజలు అప్పట్నుంచి రాజుతో పాటుగా ప్రజలంతా ఒకే ఉసిరిచెట్టు కింద అమలక వ్రతాన్ని చేయడం ఆరంభించారు. ఈ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో ఉసిరిచెట్టును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయి.
