ఎన్సీపీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని నడపగలిగితే, బీజేపీతో ఎందుకు న‌డ‌ప‌కూడ‌ద‌ని అన్నారు. గతేడాది బీజేపీతో పొత్తుపై ఎన్సీపీలో అంతర్గతంగా చర్చలు జరిగాయన్నారు. దీనిపై ఎమ్మెల్యేల మధ్య కూడా చర్చ జరిగింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచ‌న‌ రూపుదిద్దుకుంది. ఈ నిర్ణయం (ఎన్‌డీఏతో కలిసి వెళ్లడం) నేను లేదా అజిత్ పవార్ మాత్రమే తీసుకున్నది కాదు, మొత్తం ఎన్సీపీ తీసుకున్నదన్నారు.

మహారాష్ట్రలో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన నేషనలిస్ట్ కాంగ్రెస్ (NCP) పార్టీ భవిష్యత్తు ప్రస్తుతం అయోమయంలో పడినట్లే కనిపిస్తోంది. కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీయేలో చేరిన అజిత్ పవార్ (Ajit Pawar) .. ఈరోజు మహారాష్ట్రలో ఎన్సీపీ (NCP) కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక చర్చలు జోరందుకున్నాయి. ఇదిలా ఉండగా.. 2022లో మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వంతో జతకట్టే అవకాశాలను అన్వేషించాలని.. పార్టీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేలలో 51 మంది శరద్ పవార్‌ను డిమాండ్ చేశారని.. ఆ ఎమ్మెల్యేలలో జయంత్ పాటిల్(ప్ర‌స్తుత ఎన్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు) కూడా ఉన్నారని ఎన్సీపీ అగ్రనేతల్లో ఒకరైన ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.

ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పటేల్ మాట్లాడుతూ.. ఎన్సీపీ శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని నడపగలిగితే, బీజేపీతో ఎందుకు న‌డ‌ప‌కూడ‌ద‌ని అన్నారు. గతేడాది బీజేపీతో పొత్తుపై ఎన్సీపీలో అంతర్గతంగా చర్చలు జరిగాయన్నారు. దీనిపై ఎమ్మెల్యేల మధ్య కూడా చర్చ జరిగింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచ‌న‌ రూపుదిద్దుకుంది. ఈ నిర్ణయం (ఎన్‌డీఏతో కలిసి వెళ్లడం) నేను లేదా అజిత్ పవార్ మాత్రమే తీసుకున్నది కాదు, మొత్తం ఎన్సీపీ తీసుకున్నదన్నారు.

శరద్ పవార్‌ను ఎన్‌డీఏలో చేరే అవకాశాలను అన్వేషించాలని కోరిన 51 మంది ఎమ్మెల్యేలలో జయంత్ పాటిల్ కూడా ఉన్నారని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్ మాత్రమే హాజరుకాలేదు. అయితే.. ప్ర‌స్తుతం షిండే ప్రభుత్వంతో కలిసి వెళ్లే అవకాశాలను అన్వేషించడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. శరద్ పవార్ నాపై కోపంగా ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయ‌న‌ నా గురించి ఏమనుకున్నా, నేను ఆయ‌న‌ను ఎదుర్కొంటానని పటేల్ అన్నారు.

అజిత్ ప‌వార్ స‌హా అధికార సంకీర్ణంలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేయడంపై స్పందిస్తూ.. పార్టీలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేద‌ని.. తామెవ‌రూ రాష్ట్ర అధ్యక్షుడిగా జయంత్ పాటిల్ ను ఎన్నుకోలేదని, ఆయన తీసుకున్న నిర్ణయాలను పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌లో భాగమవుతారా అని అడిగిన ప్రశ్నకు.. అజిత్ ప‌వార్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తిరుగుబాటుదారుడు అజిత్ పవార్‌కు మద్దతు ఇచ్చినందుకు ప్రఫుల్ పటేల్‌ను సోమవారం పార్టీ నుంచి బహిష్కరించడం గమనార్హం.

Updated On 4 July 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story