ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘ఆ కూటమిని నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు దానిని నడిపిస్తున్నవాళ్లకు నిర్వహణ చేతకాకుంటే నేనేం చేయగలను? అందరూ ఐక్యంగా ముందుకు నడవాలనే చెప్తాను. పశ్చిమబెంగాల్‌ను విడిచివెళ్లడం నాకిష్టం లేదు. అవకాశం లభిస్తే ఇక్కడి నుంచే నడిపిస్తాను’ అని అన్నారు. అయితే తన రాజకీయ వారసుడిని నిర్ణయించే బాధ్యత పార్టీదేనని, సమష్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీఎంగా తన బాధ్యతలతో పాటు ఇండియా కూటమిని కూడా నిర్వహిస్తానని మమత చెప్పారు. అయితే తృణమూల్‌ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించడానికి ఇండియా కూటమి(India alliance)లో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) నిరాకరించింది. కూటమి ఇతర భాగస్వాములు ఆచితూచి స్పందించారు. ఈ ప్రతిపాదన తమ కూటమిలో చర్చకు రాలేదని చెప్పారు. “మొదట అటువంటి సమస్యలను అంతర్గతంగా చర్చించుకోవాలి. అది పూర్తయిన తర్వాత, పార్టీలు తమ స్టాండ్‌లను స్పష్టంగా చెప్పగలవు” అని ఇండియా కూటమి పార్టీకి చెందిన ఎంపీ ఒకరు అన్నారు. భారతదేశంలో సీట్ల పంపకంలో వామపక్ష పార్టీలకు చోటు కల్పించడం లేదని ఈ వారం ప్రారంభంలో చెప్పిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, మమత చెప్పినదానిపై తాను స్పందించనని. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సీట్ల పంపకంలో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ehatv

ehatv

Next Story