పదిహేడేళ్ల కిందట దేశంలో సంచలనం సృష్టించిన నిఠారీ హత్యల సంఘటనను చాలా మంది మర్చిపోయే ఉంటారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆ హత్యల కేసు వార్తల్లోకి వచ్చింది. చర్చనీయాంశమైన నిఠారీ హత్యల(Nitari Murder) కేసులో అలహాబాద్ కోర్టు(Allahabad High Court) సంచలన తీర్పును ఇచ్చింది. ఆ కేసులో దోషులుగా తేలిన అన్ని కేసులలో నిర్దోషులుగా ప్రకటించింది. ముఖ్యంగా సురీందర్ కోలికి విధించిన మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది.
పదిహేడేళ్ల కిందట దేశంలో సంచలనం సృష్టించిన నిఠారీ హత్యల సంఘటనను చాలా మంది మర్చిపోయే ఉంటారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆ హత్యల కేసు వార్తల్లోకి వచ్చింది. చర్చనీయాంశమైన నిఠారీ హత్యల(Nitari Murder) కేసులో అలహాబాద్ కోర్టు(Allahabad High Court) సంచలన తీర్పును ఇచ్చింది. ఆ కేసులో దోషులుగా తేలిన అన్ని కేసులలో నిర్దోషులుగా ప్రకటించింది. ముఖ్యంగా సురీందర్ కోలికి విధించిన మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసులలో కోర్టు నిర్దోషిగా తేల్చింది.
మరో నిందితుడు, వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంథేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషిగా ప్రకటించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై ఘజియాబద్‌లోని సీబీఐ కోర్టు కోలీ, పంధేర్‌లకు మరణశిక్షను విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ కోలి, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్.హెచ్.ఎ.రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యిందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది.
అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం ఆరు కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ తెలిపారు. 2006, డిసెంబర్ 29న నోయిడాలోని నిఠారీ ప్రాంతంలో మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పంధేర్ ఇంట్లో సురీందర్ కోలి పనిమనిషిగా ఉండేవాడు. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు ఆశచూపి ఇంట్లోకి తీసుకొచ్చేవాడు.
వారిపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసేవాడనేది ప్రధాన ఆరోపణ. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతే కాకుండా నరమాంసం తినేవాడని ఆరోపించింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా, సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు పది కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు.
జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
"Written By : Senior Journalist Sreedhar"