వారణాసిలో(Varanasi) జ్ఞానవాపి మసీదు(Gnanavapi Mosque) కేసులో అలహాబాద్ హైకోర్టు(Alhabad HighCourt) సంచలన నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ మందిరం(Kashi Vishwanatha Temple)-జ్ఞానవాపీ వివాదంపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పలు పిటిషన్లు మంగళవారం అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ హిందూ ధార్మిక సంఘాలు వారణాసి కోర్టులో వేసిన సివిల్ దావా పెండింగ్లో ఉంది.
వారణాసిలో(Varanasi) జ్ఞానవాపి మసీదు(Gyanavapi Mosque) కేసులో అలహాబాద్ హైకోర్టు(Alhabad HighCourt) సంచలన నిర్ణయం తీసుకుంది. కాశీ విశ్వనాథ మందిరం(Kashi Vishwanatha Temple)-జ్ఞానవాపీ వివాదంపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పలు పిటిషన్లు మంగళవారం అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ హిందూ ధార్మిక సంఘాలు వారణాసి కోర్టులో వేసిన సివిల్ దావా పెండింగ్లో ఉంది. ఈ సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ ముస్లిం సంఘాలు వేసిన ఐదు పిటిషన్‌లపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు..వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం ప్రకారం మసీదు స్వరూపాన్ని మార్చకూడదని, అందువల్ల ఆ పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ అంజుమన్(Anjuman) ఇంతెజామియా మసీదు కమిటీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు తమ వాదనలను వినిపించాయి.
అయితే జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నాయి. జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన. దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను గతంలో న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.