జ్ఞానవాపి(Gyanvapi) మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్‌ కా తేకానాలో హిందువుల పూజలకు(Hindu Poojas) అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది.

జ్ఞానవాపి(Gyanvapi) మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్‌ కా తేకానాలో హిందువుల పూజలకు(Hindu Poojas) అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది.వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ(AIMC) పిటిషన్‌ను జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ బెంచ్‌ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15వ తేదీన కోర్టు రిజర్వ్‌ చేసింది. మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్‌ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.

Updated On 26 Feb 2024 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story