మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) చాలా కాలంగా ఫ్రెండ్‌షిప్(Friendship) చేస్తున్న స్నేహితురాలిని పెళ్లి చేసుకుందో యువతి.. సారీ యువకుడు. కన్‌ఫ్యూజన్‌గా ఉంది కదూ! అసలేం జరిగిందంటే అల్కా సోని(Alka Sony) అనే మహిళకు కొంత కాలం తర్వాత తాను స్త్రీని కాదేమోనన్న అనుమానం కలిగింది. అప్పట్నుంచి పురుషుడిగానే జీవించడం మొదలు పెట్టింది. 47 ఏళ్ల వయసులో లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది. పురుషుడిగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఇండోర్‌లో(Indore) చాలా కాలంగా ఫ్రెండ్‌షిప్(Friendship) చేస్తున్న స్నేహితురాలిని పెళ్లి చేసుకుందో యువతి.. సారీ యువకుడు. కన్‌ఫ్యూజన్‌గా ఉంది కదూ! అసలేం జరిగిందంటే అల్కా సోని(Alka Sony) అనే మహిళకు కొంత కాలం తర్వాత తాను స్త్రీని కాదేమోనన్న అనుమానం కలిగింది. అప్పట్నుంచి పురుషుడిగానే జీవించడం మొదలు పెట్టింది. 47 ఏళ్ల వయసులో లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది. పురుషుడిగా మారింది. తన పేరును అస్తిత్వ సోనిగా మార్చుకుంది. తన స్నేహితురాలు ఆస్తాను(Aastha) పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ కోర్టులో(Family court) జరిగిన ఈ ప్రత్యేక పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గురువారం మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కూడా కొత్త దంపతులు అందుకున్నారు. అల్కా సోని సోదరి ద్వారా ఆస్తాకు పరిచయం అయ్యింది. అల్కా సోని, ఆస్తా మధ్య ఏర్పడిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. అల్కా సోని పురుషుడిగా మారిన తర్వాత ఇండోర్ కలెక్టర్‌ను ఇద్దరూ కలిశారు. తమ పరిస్థితిని వివరించారు. స్పెషల్ మ్యారేజ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరి పెళ్లికి అనుమతి దొరకడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్(Special Marriage Act) ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తామిద్దరం హిందూ సంప్రదాయ పద్దతిలో మరోసారి పెళ్లి చేసుకుంటామని ఆస్తా తెలిపారు. గత అక్టోబర్ మాసంలో ట్రాన్స్‌జండర్ వ్యక్తుల పెళ్లిళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత చట్టాలతో సహా ఇప్పటికే ఉన్న చట్టాలను అనుసరించి నేరుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వివాహం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే!