దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వేడి పెరిగింది. అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రజల దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారు. కొందరు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అలీగఢ్(Aligarh)లో ఓ అభ్యర్థి ఇలాగే చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తున్నారు.
దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వేడి పెరిగింది. అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రజల దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారు. కొందరు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అలీగఢ్(Aligarh)లో ఓ అభ్యర్థి ఇలాగే చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరి మెడలోనైనా చెప్పుల దండ ఎందుకు వేస్తాం? అవమానించడానికే కదా! ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే అలీగఢ్‌లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన పండిట్ కేశవ్‌దేవ్ గౌతమ్(Kashvee Gautam) చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారం(Election Campaign) చేస్తున్నారు. పూలమాలకు బదులుగా చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడుగుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పండిట్ కేశవ్‌దేవ్ గౌతమ్‌కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. అందుకే ఆయన తన మెడలో ఏడు చెప్పులతో కూడిన ఓ దండను వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. తాను గెలిస్తే అవినీతి అన్నది లేకుండా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే రెండు సంస్థలను నడుపుతున్న పండిట్ కేశవ్‌దేవ్ గౌతమ్ సమాచార హక్కు కార్యకర్త కూడా! ఇంతకు ముందు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.