ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవారు.. తమ బోధనలతో ఎంతో మందిని తీర్చిదిద్ది దేశానికి అందించిన ఉపాధ్యాయులు తమకు వచ్చే జీతం మాత్రం చాలీచాలనట్లుగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం పంతుళ్లకు(Teacher) దేశ వ్యాప్తంగా భలే గిరాకీ పెరిగింది. ఇప్పుడు టీచర్‌ ఈ సాంప్రదాయాన్ని మార్చేశాడు. రూ.9.6 కోట్ల వార్షిక వేతనంతో అలఖ్ పాండే(Alakh Pandey) అనే వ్యక్తి దేశంలోనే ధనిక ఉపాధ్యాయుడిగా రికార్డు సృష్టించాడు. అతనే స్వయంగా రూ.5 కోట్ల పారితోషికంలో కోత పెట్టుకొని రూ.4 కోట్ల 57 లక్షలకు జీతం పొందుతున్నారు.

ట్యూషన్‌ ఏజెన్సీగా ఉన్ని ఫిజిక్స్‌ వాలా(Physiscs wala) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్‌ పాండే ఫోర్బ్స్ ప్రకారం అంటే రూ. 2000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన అలఖ్ పాండే భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన ఉపాధ్యాయుడిగా రికార్డ్‌ సృష్టించారు. అలఖ్‌ తొలి జీతం రూ.5 వేలు అయినా తన ప్రతిభతో ఆకర్షణీయంగా పాఠాలు చెప్పి విద్యార్థుల ఆదరణ పొందాడు. తరువాత అతను తన స్వంత ఫిజిక్ వాలా సంస్థను ప్రారంభించాడు. అలహాబాద్‌లో పుట్టిన అలఖ్ పాండే నటుడిని కావాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా 8వ తరగతి చదువుతున్నప్పుడే ఇతర పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, సోదరి చదువు కోసం అతని తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్ముకున్నారు. ఇంత కష్టతరమైన జీవితం ఉన్నా అలఖ్ 12వ తరగతిలో 93.5% మార్కులు సాధించాడు. అలఖ్‌ కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నాడు. అలఖ్ పాండే 2017లో యూపీలోని ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను వదిలాడు. కోవిడ్ సమయంలో ఇతని వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఈ సంస్థ 500 మందికి పైగా ఉపాధ్యాయులు, 100 మంది సాంకేతిక సిబ్బందిని కలిగి ఉంది. యూట్యూబ్‌లో అతనికి కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Updated On 28 Feb 2024 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story