భూమి అంటేనే వింతలు విచిత్రాల నెలవు.. ఆకాశంలో అంతకంటే ఎక్కువ ఉంటాయి. కాని భూమి మీద మనం చూడగలిగే వింతలు విడ్డూరాలకు కొదవ లేదు. భూమి అనేక అద్భుతాలతో నిండి ఉంది. ఈ ప్రపంచంలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలు ఉన్నాయి. ఆ విధంగా మనం ఓ అద్భుత గ్రామం గురించి చూడబోతున్నాం.
భూమి అంటేనే వింతలు విచిత్రాల నెలవు.. ఆకాశంలో అంతకంటే ఎక్కువ ఉంటాయి. కాని భూమి మీద మనం చూడగలిగే వింతలు విడ్డూరాలకు కొదవ లేదు. భూమి అనేక అద్భుతాలతో నిండి ఉంది. ఈ ప్రపంచంలో మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో వింతలు ఉన్నాయి. ఆ విధంగా మనం ఓ అద్భుత గ్రామం గురించి చూడబోతున్నాం.
ఈ గ్రామం ప్రత్యేకత ఉందంటే. ఈ గ్రామంలో ఎప్పుడూ వర్షాలు(Rains) పడవు.. అసలు వర్షం అంటే ఏంటో ఈ గ్రామం చూడలేదు. వింటానికి విచిత్రంగా.. నమ్మడానికి వీల్లేని విషయమే అయినా.. ఇది నిజం ఈ గ్రామంలో ఎప్పుడూ వర్షాలు పడవు. మన దేశంలోని మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలోని మావ్సిన్రామ్(Mawsynram) గ్రామం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అలాగే ఇప్పుడు చెప్పుకోబోయే ఊరిలో అసలు ఇంత వరకూ వర్షం పనడలేదు.
అలా అని అది ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే..? ఈ గ్రామం యెమెన్(Yemen) రాజధాని సనాలో(Sana) ఉంది. అల్-హుదైబ్ సనాకు పశ్చిమాన మనక్ హరాజ్‌లోని ఒక గ్రామం. ఇక్కడ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదన్నారు. అయితే ఈ గ్రామాన్ని చాలా మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. అదే వారికి జీవనాధారం అయ్యింది.గ్రామంలో కొండ ప్రాంతంలో చాలా అందమైన ఇళ్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. దాంతో ఈ ఊరు చూసేందుకు ఇక్కడికి పర్యాటకుల తాకిడి పెరుగుతోందని చెబుతున్నారు.
అల్-హుదైబ్( Al -hutaib) గ్రామం భూమి యొక్క ఉపరితలం నుండి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గ్రామం మేఘాల పైన ఉండడం వల్ల ఇక్కడ వర్షాలు కురవకపోవడమే కారణమని చెబుతారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతం ఎండిపోయింది.ఈ గ్రామంలో పురాతన మరియు ఆధునిక శిల్పకళను చూడవచ్చని పర్యాటకులు నివేదిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని అల్-బోహ్రా లేదా అల్-ముక్రమ విలేజ్ అని కూడా అంటారు. నివేదికల ప్రకారం, యెమెన్ సమాజానికి చెందిన ప్రజలు తమ నివాసం కోసం ఈ స్థలాన్ని ఎంచుకున్నారు.