సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. మహా అయితే మరో రెండు నెలలు అంతే! ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్(Election Schedule) కూడా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా 370 సీట్ల టార్గెట్‌ను చేరుకోవడానికి బీజేపీ(BJP) ముమ్మర కసరత్తులు చేస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. మహా అయితే మరో రెండు నెలలు అంతే! ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్(Election Schedule) కూడా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నాయి. ముఖ్యంగా 370 సీట్ల టార్గెట్‌ను చేరుకోవడానికి బీజేపీ(BJP) ముమ్మర కసరత్తులు చేస్తోంది. షెడ్యూల్ రాకముందే తొలి జాబితాను ప్రకటించాలనుకుంటోంది. ఈ తొలి జాబితాలో కొత్త వ్యక్తులకు, యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది బీజేపీ ఉద్దేశం. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్(Kangana Ranut), హీరో అక్షయ్ కుమార్‌లకు(Akshay kumar) టికెట్ ఇవ్వాలనుకుంటోంది. తొలి జాబితాలోనే వీరిద్దరి పేర్లు ఉండవచ్చు. ఢిల్లీలోని చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అక్షయ్‌కుమార్ పోటీ చేయనున్నారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నుంచి కంగనా రనౌత్‌ను నిలబెట్టాలనుకుంటోంది అధినాయకత్వం. నరేంద్రమోదీ పేరు చెబితే చాలు కంగనా రనౌత్‌లో భక్తి భావం పొంగుకొస్తుంటుంది. మోదీని భగవంతుడి 11 అవతారంగా కంగనా కీర్తించారు కూడా! రాజకీయాల్లో వచ్చేందుకు ఇదే సరైన సమయమని ఇటీవల కంగనా కామెంట్ చేసిన విషయం తెలిసిందే!
కంగనా బీజేపీలో చేరితే స్వాగతిస్తామని పార్టీ అధ్యక్షుడు జే.పీ.అడ్డా(JP Nadda) గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ కూడా అంతే. చాలా సందర్భాలలో మోదీకి అనుకూలంగా మాట్లాడారు అక్షయ్ కుమార్.