బీజేపీ అజేయం ఏమీ కాదని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ లఖ్‎నవూలో ఎన్డీటీవీ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న అఖిలేష్.. బీజేపీని ఓడించడానికి ఒక కొత్త ఫార్మూలాను సూచించారు. బీజేపీని ఓడించే శక్తి PDA కూటమికి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. PDAలో P అంటే పిఛ్ డే (వెనుకబడిన వర్గాలు), D అంటే దళితులు, A అంటే అల్పసంఖ్యాక వర్గాలంటూ అఖిలేష్ వివరణ ఇచ్చారు. ఈ ముగ్గురు కలిస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులు, దళితులు, అల్ప సంఖ్యాక వర్గాలు ప్రత్యేక పాత్ర పోషిస్తారని, ఎన్డీయేను పీడీఏ ఓడించడం ఖాయమని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

బీజేపీ అజేయం ఏమీ కాదని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ లఖ్‎నవూలో ఎన్డీటీవీ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న అఖిలేష్.. బీజేపీని ఓడించడానికి ఒక కొత్త ఫార్మూలాను సూచించారు. బీజేపీని ఓడించే శక్తి PDA కూటమికి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. PDAలో P అంటే పిఛ్ డే (వెనుకబడిన వర్గాలు), D అంటే దళితులు, A అంటే అల్పసంఖ్యాక వర్గాలంటూ అఖిలేష్ వివరణ ఇచ్చారు. ఈ ముగ్గురు కలిస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులు, దళితులు, అల్ప సంఖ్యాక వర్గాలు ప్రత్యేక పాత్ర పోషిస్తారని, ఎన్డీయేను పీడీఏ ఓడించడం ఖాయమని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

"త్తరప్రదే‎శ్‎లో 80 లోక్‎సభ స్థానాల్లో బీజేపీని ఓడించాలంటే ప్రముఖ జాతీయ పార్టీలు మాకు అండగా ఉండాలి. పెద్ద మనసుతో చేతులు కలపి, మేము 80కి 80 సీట్లు గెలుస్తామనే భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చాలా పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోరాడాం. దాని వల్ల ఫలితాలు కూడా వచ్చాయి. ఈసారి కూడా ఇదే ఫార్మూలాపై పని చేయాలి. యూపీలో బీజేపీ ఓడితే ఆ పార్టీ పనైపోయినట్లే " అని అన్నారు. అయితే ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలి" అని తేల్చారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో చూసుకొని దానిని బట్టి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం జరగాలి" అని అఖిలేష్ యాదవ్ సూచించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విపక్ష కూటమి గురించి ప్రశ్నించగా.. "80 సీట్లలో ఓడించండి..బీజేపీని సాగనపండి" అని నినాదం ఇచ్చారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్సీతో పొత్తుపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..మిత్ర పక్షాల విషయంలో తామెప్పుడూ నిజాయితీగా వ్యవరిస్తామని చెప్పారు. సీట్ల గురించి కలహించుకునే పరిస్థితి ఉండదన్నారు.

దేశవ్యాప్తంగా మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో గెలిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. దీన్ని అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ పాత మిత్రుల్ని, శత్రువుల్ని కూడా కలుపుకుని పోతున్నాయి. ఇదే క్రమంలో ప్రధాన విపక్షం కాంగ్రెస్‎తో విభేదిస్తున్న ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెరపైకి కొత్త ఫార్ములా తెచ్చారు. జాతీయ పార్టీలు పెద్ద మనసుతో తమకు మద్దతు ఇస్తే యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. అంటే పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ తన పార్టీ ఎస్పీకి మద్దతిస్తే బీజేపీని యూపీలో ఓడించడం కష్టం కాదనేది ఆయన ఆలోచన. అయితే ఉమ్మడి కూటమి విషయంలో ముందుకురాని అఖిలేష్ విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. నిజానికి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి కాంగ్రెస్ 2, 1 సీట్లలో మాత్రమే గెలిచింది. వాస్తవానికి 1996 నుంచి దాని ఓట్ల శాతం సింగిల్ డిజిట్‎కే పరిమితమైంది. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర, కర్నాటక గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరింత విశ్వాసం పెరిగింది. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఈసారి బీజేపీని ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే యోచనతో ఉంది. కానీ పొత్తుల విషయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న శైలి..అఖిలేష్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలను ఇబ్బందికరంగా మారిందన్నది విశ్లేషకుల భావన.

మరోవైపు ప్రభుత్వపరంగా ప్రైవేట్‌లో రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలన్నారు అఖిలేష్ యాదవ్. కులాల వారీగా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2022 అసెంబ్లీ సార్వత్రి ఎన్నికల మేనిఫెస్టోలో తాము కుల జనగణన అంశాన్ని చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలకు భద్రత లేదన్న అఖిలేష్ ..యూపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఎన్‌సిఆర్‌బి గణాంకాలు రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిని అద్దంపడుతన్నాయని చెప్పారు. గత ఆరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో ఒక్క జిల్లా ఆస్పత్రి కూడా నిర్మించలేదని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఇంటింటికీ అంబులెన్స్ సేవను నిలిపివేసిందని, దాని కారణంగా చాలా మంది పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి యూపీ పెట్టుబడులకు చాలా సానుకూలంగా ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు గుర్తుంది, మా ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల కోసం సమావేశాలు నిర్వహించకుండానే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి " అని గుర్తు చేశారు. ఈరోజు యూపీకి పెట్టుబడులు రావడం లేదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీ ప్రభుత్వం పేదలను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆయన..అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలలో 'పేదల గౌరవం', 'ద్రవ్యోల్బణం' నిరుద్యోగం అతిపెద్ద సమస్యలని అఖిలేష్ యాదవ్ అన్నారు. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోపోవడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారన్న అఖిలేష్.. ఈసారి ప్రజల్లో మార్పు వస్తోందని అభిప్రాయపడ్డారు. 2014లో ఉత్తరప్రదేశ్‌ ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిన బీజేపీ..ఈసారి యూపీ ప్రాతిపదికనే అధికారం నుంచి వైదొలగుతుందని అఖిలేష్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated On 18 Jun 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story