ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీని పరోక్షంగా దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాట్లాడుతూ.. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియాకు దేవుడు విష్ణువుతో పాటు భారత

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీని పరోక్షంగా దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాట్లాడుతూ.. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియాకు దేవుడు విష్ణువుతో పాటు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు.

లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం 'ఎకనా స్టేడియం' అని పేరు పెట్టింది. లార్డ్ విష్ణు పేర్లలో ఏకనా ఒకటి. అయితే 2018లో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి గౌరవార్ధం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిని 'భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం'గా మార్చింది.

“గుజరాత్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియాకు చాలా మంది ఆశీర్వాదం లభించేది. లక్నోలో మ్యాచ్‌ జరిగి ఉంటే.. టీమిండియా మహావిష్ణువు, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులతో గెలిచి ఉండేది అని ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా స‌భ‌లో అఖిలేష్ అన్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌లోనే కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. దీని కారణంగా ఆటగాళ్ల సంసిద్ధ‌త అసంపూర్థిగా మిగిలిపోయింద‌ని అఖిలేష్ అన్నారు.

ఫైన‌ల్ మ్యాచ్‌పై కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. స్టేడియానికి చెడు శకునము రావ‌డం వ‌ల్లే ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిపోయేలా చేసిందని అన్నారు. టీవీలలో ఈ విషయాన్ని చూపించరని.. కానీ దేశ ప్రజలకు ఈ విషయం తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు.

Updated On 22 Nov 2023 2:47 AM GMT
Ehatv

Ehatv

Next Story