ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలోకి త్వరలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ వస్తారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబీటీ) సోమవారం ప్రకటించింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం తన ఎమ్మెల్యేలతో కలిసి నాటకీయంగా బీజేపీ నేతృత్వంలోని షిండే ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) స్థానంలోకి త్వరలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్(Ajith Pawar) వస్తారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) సోమవారం ప్రకటించింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం తన ఎమ్మెల్యేలతో కలిసి నాటకీయంగా బీజేపీ నేతృత్వంలోని షిండే ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం(Deputy CM)గా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) అయోమయంలో పడ్డారు. అజిత్ పవార్ చర్యను తిరుగుబాటుగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నేతృత్వంలోని బీజేపీ(BJP).. మహారాష్ట్ర(Maharashtra)తో పాటు దేశ రాజకీయాలను ‘చెత్త’లోకి నెట్టిందని శివసేన (యుబిటి) మౌత్ పీస్ ‘సామ్నా’(Saamna) సంపాదకీయంలో పేర్కొంది.
అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారని సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్(Sanjay Raut) రాశారు. ఈసారి డీల్ మరింత బలంగా ఉండనుందని కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి కోసం అజిత్ పవార్ అక్కడికి వెళ్లలేదు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై త్వరలో అనర్హత వేటు వేసి.. పవార్‌కు పట్టం కట్టనున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయ సంప్రదాయం గతంలో లేదని, దీనికి ప్రజల మద్దతు ఎప్పటికీ లభించదని సామ్నా పేర్కొంది. షిండే, అతని తిరుగుబాటు మిత్రులను అనర్హులుగా ప్రకటించే రోజు ఎంతో దూరంలో లేదని వెల్లడించారు.