మధ్యప్రదేశ్(Madhya Pradesh) ఉజ్జయినిలో(Ujjain) జరిగిన దారుణ సంఘటన దేశాన్ని కదిలించివేసింది. 12 ఏళ్ల అమ్మాయిపై మానవ మృగాలు లైంగికదాడికి(Sexual Assualt) పాల్పడటం దుర్మార్గమైతే, ఆ పాప నెత్తుటి గాయాలతో వీధివీధి తిరిగినా ఎవరూ సాయం అందించకపోవడం మహా దుర్మార్గం. అయితే మానవత్వం ఇంకా చచ్చిపోలేదని, కొన ఊపిరితో అది బతికే ఉందని నిరూపితమయ్యింది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh) ఉజ్జయినిలో(Ujjain) జరిగిన దారుణ సంఘటన దేశాన్ని కదిలించివేసింది. 12 ఏళ్ల అమ్మాయిపై మానవ మృగాలు లైంగికదాడికి(Sexual Assualt) పాల్పడటం దుర్మార్గమైతే, ఆ పాప నెత్తుటి గాయాలతో వీధివీధి తిరిగినా ఎవరూ సాయం అందించకపోవడం మహా దుర్మార్గం. అయితే మానవత్వం ఇంకా చచ్చిపోలేదని, కొన ఊపిరితో అది బతికే ఉందని నిరూపితమయ్యింది. ఆ బాలికను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ముందుకు రాని పక్షంలో తాను దత్తత తీసుకుంటానని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ ఘటనలో ఓ పూజారి బాధితురాలిని గుర్తించి ఆమెకు దుస్తులు ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తరలించి మరీ పోలీసులకు సమాచారం అందించారు.
ఆస్పత్రిలో ఆ బాలికకు ఇద్దరు పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది .దీంతో పాటు ఆమె కోలుకునేంత వరకు చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు ఆమె చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానంటూ ఉజ్జయిని మహాకాల్ ఇన్‌స్పెక్టర్ అజయ్ వర్మ(Inspector Ajay Verma) ముందుకొచ్చారు. ఆమెని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే క్రమంలో విఫలమైతే ఆమెను తాను దత్తత(Adoption) తీసుకుంటానన్నారు. ఆసుపత్రిలో ఆ చిన్నారి బాధతో ఏడ్చిన ఏడ్పు తనను కదిలించిందని చెప్పారు. ఆ రోదనలు తనతో కన్నీళ్లు పెట్టించాయని, దేవుడు ఇంత చిన్న వయసులో ఆమెకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడా? అని అనిపించిందని అజయ్ వర్మ తెలిపారు. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ముందుకు రావట్లేదేమోనన్న సందేహం కలుగుతుందని చెప్పారు. వాళ్లు ముందుకు వస్తే.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాను చూసుకుంటానని, ఒకవేళ ఆమె కుటుంబం ముందుకు రానిపక్షంలో తానే ఆ పాపను లీగల్‌గా దత్తత తీసుకుని పెంచుకుంటా అని ఇన్‌స్పెక్టర్ వర్మ అంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. తీవ్రమైన గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై సుమారు ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది.దాదాపు రెండు గంటల పాటు ఇంటింటికి వెళ్లి వేడుకుంది. ఎవరూ ఆమెకు సాయం అందించలేదు. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు.