Ajay V Bhatt & Narinder Singh Kapany : యూఎస్‌బీ, ఆప్టికల్ ఫైబర్ సృష్టికర్తలు భారతీయులని మీకు తెలుసా.?
నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను(Internet) ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్(Ptical fiber), వైర్‌లెస్ మొబైల్ ఫోన్‌లు చేరాయి. అయితే ఇంటర్నెట్ సంబంధిత పలు విషయాలను అభివృద్ధి చేయడంలో భారతీయులు సహకరించారు. అవును.. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులు ఆవిష్కరించిన వాటి గురించి తెలుసుకుందాం.

యూఎస్‌బీ(USB)
మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లలో ఉపయోగించే యూఎస్‌బీ కేబుల్‌ను(USB Cable) భారతీయ వ్యక్తి కనుగొన్నాడు. అతని పేరు అజయ్ వి.భట్(Ajay V. Bhatt). అజయ్ వి భట్ ఒక భారతీయ-అమెరికన్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్. అతనే యూఎస్‌బీని సృష్టించాడు. దీనిని నేడు ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్నారు.
ఆప్టికల్ ఫైబర్(Optical fiber)
ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఆప్టికల్ ఫైబర్ అవసరం. నేటి కాలంలో ఇంటర్నెట్ డెలివరీ చేయడానికి ఆప్టికల్ ఫైబర్ అవసరంగా మారింది. అయితే ఆప్టికల్ ఫైబర్‌ను పంజాబ్‌లోని మోగాలో జన్మించిన నరీందర్ సింగ్ కపానీ(Narinder Singh Kapani) కనుగొన్నారు. భౌతిక శాస్త్రవేత్త అయిన అతడిని ఆప్టికల్ ఫైబర్ పితామహుడు అని పిలుస్తారు