కంబళ ఉత్సవాల(Kambala Celebrations) కోసం కర్ణాటక(Karnataka) సంసిద్ధమయ్యింది. ప్రతి ఏడాది ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు ఈసారి మరింత గొప్పగా జరగబోతున్నాయి. ప్రముఖ సినీ తారలు ఐశ్వర్యరాయ్‌(Aishwarya Rai), అనుష్క షెట్టి(anushka Shetty), సునీల్‌ షెట్టి(sunil shetty), శిల్పా షెట్టి(Shilpa shetty), కేజీఎఫ్‌ ఫేమ్‌ యశ్‌(yash), దర్శన్‌లతో పాటు క్రికెట్‌ ఆటగాడు కె.ఎల్‌.రాహుల్‌(KL Rahul) కూడా ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు.

కంబళ ఉత్సవాల(Kambala Celebrations) కోసం కర్ణాటక(Karnataka) సంసిద్ధమయ్యింది. ప్రతి ఏడాది ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు ఈసారి మరింత గొప్పగా జరగబోతున్నాయి. ప్రముఖ సినీ తారలు ఐశ్వర్యరాయ్‌(Aishwarya Rai), అనుష్క షెట్టి(anushka Shetty), సునీల్‌ షెట్టి(sunil shetty), శిల్పా షెట్టి(Shilpa shetty), కేజీఎఫ్‌ ఫేమ్‌ యశ్‌(yash), దర్శన్‌లతో పాటు క్రికెట్‌ ఆటగాడు కె.ఎల్‌.రాహుల్‌(KL Rahul) కూడా ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. కర్ణాటక తీర ప్రాంత ప్రజలు కొన్ని శతాబ్దాలుగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. వారి సంస్కృతి సంప్రదాయాలలో ఇదో భాగం. కాంతార సినిమాలో కూడా కంబళ పోటీలను చూపించారు. హీరో రిషబ్‌ షెట్టి(Rishab shetty) ఈ పోటీలో పాల్గొంటాడు. సినిమా కోసం కాకుండా రిషబ్‌ షెట్టి నిజంగానే కంబళ పోటీలలో పాల్గొన్నాడు. నవంబర్‌లో ప్రారంభమయ్యే ఈ వేడకలు మార్చి వరకు జరుగుతాయి. ఈసారి అతి పొడవైన ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. నిజానికి శీతాకాలంలో తీర ప్రాంతంలోని రైతులు గేదెలను పట్టుకుని బురదపై పరుగులు తీస్తారు. పంటలు బాగా పండాలని దేవుడిని ప్రార్థించడానికి ఇలా చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ కంబళ పోటీలు జరుగుతున్నా నాలుగైదు ఏళ్ల నుంచి ఇవి చాలా పాపులరయ్యాయి. తీర ప్రాంతానికే పరిమితమైన ఈ పోటీలు ఇప్పుడు రాష్ట్ర రాజధాని బెంగళూరు వరకు వచ్చేశాయి. ప్రజల నుంచి బ్రహ్మండమైన రెస్పాన్స్‌ రావడంతో మొదటిసారిగా బెంగళూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 25, 26 తేదీలలో పాలెస్‌ గ్రౌండ్‌లో ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను చూసేందుకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంటున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 150 గేదెలు ఉన్నాయి. ఆ మేరకు వాటి యజమానులు తమ పేర్లు రిజిస్టర్​ చేసుకున్నారు. పోటీలో గెలిచిన వారికి లక్షన్నర రూపాయల నగదును అందించనున్నారు.

Updated On 6 Nov 2023 11:55 PM GMT
Ehatv

Ehatv

Next Story