దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. వాయు కాలుష్యం(Air pollution) ఢిల్లీని నరకప్రాయం చేస్తోంది. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది.ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు. వాయు కాలుష్యం(Air pollution) ఢిల్లీని నరకప్రాయం చేస్తోంది. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది.ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఢిల్లీలో జీఎన్‌జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. పెరుగుతోన్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నదని తేలింది. వాయు కాలుష్యం కారణంగా ప్రజలలో చిరాకు, కోపం బాగా పెరిగాయి. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. నిద్రలేమితో అవస్థలు పడుతున్నారు. విపరీతమైన తలనొప్పితో అల్లాడిపోతున్నారు. మనుషుల ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట వంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటారని పరిశోధకులు అంటున్నారు. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభవాన్ని చూపుతున్నది. విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మెదడుకు చేరి, దాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. కాలుష్యం అధికంగా ఉన్న చోట నివసిస్తున్నవారికి అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు సోకుతాయని పరిశోధకులు చెబుతున్నారు. స్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం అధికమవుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడి ఎదురవుతాయి. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా చాలా మంది కాలు బయటపెట్టడం లేదు. ఇంతకు ముందుగా బయట తిరడం లేదు. బంధుమిత్రులను కలవడం ఎప్పుడో మానేశారు. మార్నింగ్ వాక్‌కు కూడా వెళ్లడం లేదు. ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు.