Lahore Air Pollution : లాహోర్లోనూ ఢిల్లీ పరిస్థితి... వాయుకాలుష్యంతో అల్లాడిపోతున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) వాయు కాలుష్యం(Air Pollution) ఏ స్థాయికి చేరుకుందో మనకు తెలుసు! అక్కడి ప్రజలు ఊపిరితీసుకోవడానికి కూడా అవస్థలు పడుతున్న విషయమూ మనకు తెలుసు. అయితే మన దేశం మాత్రమే కాదు, పొరుగుదేశం పాకిస్తాన్‌లో(Pakistan) కూడా గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాకిస్తాన్‌లోని రెండో అతి పెద్ద నగరమైన లాహోర్‌లో(Lahore) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Lahore Air Pollution
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) వాయు కాలుష్యం(Air Pollution) ఏ స్థాయికి చేరుకుందో మనకు తెలుసు! అక్కడి ప్రజలు ఊపిరితీసుకోవడానికి కూడా అవస్థలు పడుతున్న విషయమూ మనకు తెలుసు. అయితే మన దేశం మాత్రమే కాదు, పొరుగుదేశం పాకిస్తాన్‌లో(Pakistan) కూడా గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాకిస్తాన్‌లోని రెండో అతి పెద్ద నగరమైన లాహోర్‌లో(Lahore) ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కమ్ముకోవడంతో రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. నగరంలో లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు. జీవనం కష్టమవుతోంది. లాహోర్‌లోని గాలి నాణ్యత(Air Quality) ప్రపంచంలోనే అధ్వాన్నంగా ఉందని స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ తెలిపింది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గింది. ఫలితంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు తలెత్తుతున్నాయి. ఈ బాధలు పడలేక చాలా మంది నగరాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇలాంటి పరిస్థితులే అక్కడ కనిపిస్తుంటుంటాయి.
