ఢిల్లీ నుంచి లండన్‌(Delhi to London)కు బయలుదేరిన ఎయిరిండియా విమానం(Air India Plane)లో ఓ ప్రయాణికుడికి, సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత విమానాన్ని హడావుడిగా తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్(Delhi Airport) పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానం ఎక్కిన‌ ప్రయాణికులను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ మేర‌కు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

"ఢిల్లీ నుండి లండన్ బ‌య‌లుదేరిన‌ ఎయిర్ ఇండియాAI-111 విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడి తీవ్రమైన వికృత ప్రవర్తన కారణంగా బయలుదేరిన వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చిందని పేర్కొంది. విమానంలో వ్రాతపూర్వక హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రయాణీకుడు గందరగోళాన్ని కొనసాగించాడు.. దీని ఫలితంగా క్యాబిన్ సిబ్బందిలోని ఇద్దరు సభ్యులకు గాయాలయ్యాయి. పైలట్ వెంట‌నే ఢిల్లీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రయాణీకుడిని ల్యాండ్ చేసిన తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించారు. పోలీసులకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిందని పేర్కొంది.

ఎయిర్ ఇండియాలో ప్రతి ఒక్కరి భద్రత, గౌరవం మాకు చాలా ముఖ్యమైనది. బాధిత క్యాబిన్ క్రూ సభ్యులకు మేము అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నాము. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఈ మధ్యాహ్నం లండన్‌కు విమాన సమయాలు రీషెడ్యూల్ చేయబడ్డాయ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

సోమవారం ఉదయం 6:35 గంటలకు ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరింది. కొద్దిసేపటికే విమానంలో ఓ ప్రయాణికుడు గొడవకు దిగాడు. సిబ్బందిపై దాడి చేయ‌డంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రయాణికుడు నియంత్రణ కోల్పోవడాన్ని చూసిన పైలట్.. విమానాన్ని తిరిగి ఢిల్లీలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు.

Updated On 10 April 2023 2:31 AM GMT
Ehatv

Ehatv

Next Story