ఒకేసారి 300 మంది విమానం క్రూ సిక్ లీవ్ లు పెట్టడంతో ఏకంగా

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు ఎటువంటి నోటీసు లేకుండా సామూహిక అనారోగ్య సెలవుపై వెళ్లిన 30 మంది క్యాబిన్ సిబ్బంది సేవలను తక్షణమే రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుండి 100 విమానాలను రద్దు చేసింది. ఇది సుమారు 15,000 మంది ప్రయాణికులను ప్రభావితం అయ్యారు. సంక్షోభం కారణంగా గురువారం నాడు 74 విమానాలు రద్దు చేశారు. బుధవారం రాత్రి 30 మంది సిబ్బందికి తొలగింపు నోటీసులు అందాయని తెలుస్తోంది. మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ తాజాగా తొలగించింది. సంస్థ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్టు తెలిపింది.

ఒకేసారి 300 మంది విమానం క్రూ సిక్ లీవ్ లు పెట్టడంతో ఏకంగా 100కి పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ఏఐఎక్స్ కనెక్ట్ సంస్థతో విలీనం అవుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో సంస్థ సమభావంతో వ్యవహరించట్లేదని, ఉన్నత బాధ్యతలకు అర్హత ఉన్నా దిగువ స్థానాలకే కొందరిని పరిమితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

Updated On 8 May 2024 11:37 PM GMT
Yagnik

Yagnik

Next Story