టాటా గ్రూప్(TATA Group) యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో(Air India Express) నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల చాలా మంది ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు(sick Leave) తీసుకున్న విషయం తెలిసిందే. సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకోవడంతో సుమారు వంద విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేయాల్సి వచ్చింది.
టాటా గ్రూప్(TATA Group) యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో(Air India Express) నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవల చాలా మంది ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు(sick Leave) తీసుకున్న విషయం తెలిసిందే. సిబ్బంది మూకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకోవడంతో సుమారు వంద విమానాలను ఎయిరిండియా సంస్థ రద్దు చేయాల్సి వచ్చింది. సెలవులు పెట్టి విమాన సేవలకు అంతరాయం కల్పించిన వారిపై సంస్థ వేటు(Fire) వేసింది. బుధవారం రాత్రి 30 మంది ఉద్యోగులకు టెర్మినేషన్ నోటీసులు(Termination Notices) పంపింది. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణమే వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ నోటీసులలో తెలిపింది. సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు పంపిన నోటీసుల్లో సంస్థ తెలిపింది. ‘సిక్‌లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లెటర్‌లో సంస్థ పేర్కొంది.
సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది (Cabin Crew) ఒకేసారి సెలవు పెట్టారు. దాంతో వందకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉంటే, యాజమాన్య వైఖరి పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు సుమారు 20 శాతం తగ్గాయన్నది ఉద్యోగులు చెబుతున్న మాట! ఈ విలీనం కారణగా ఉద్యోగులకు రావాల్సిన అలెన్సులు పూర్తిగా రద్దయ్యాయి. జీతాలు భారీగా తగ్గాయి.