నాగ్‌పూర్(Nagpur) నుంచి ముంబై(Mumbai) వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలిని తేలు(scorpion) కుట్టింది. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా(Air India) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 23న జరిగిందని ప్రకటనలో పేర్కొంది.
నాగ్‌పూర్(Nagpur) నుంచి ముంబై(Mumbai) వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలిని తేలు(scorpion) కుట్టింది. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా(Air India) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 23న జరిగిందని ప్రకటనలో పేర్కొంది. నాగ్‌పూర్-ముంబై విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టింది. ఆ ప్రయాణికురాలికి వెంటనే వైద్య సహాయం అందించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు."ల్యాండింగ్ తర్వాత.. ప్రయాణీకురాలిని వెంటనే విమానాశ్రయంలో ఒక వైద్యునికి చూపించారు. తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు" అని ప్రకటనలో పేర్కొంది.
విమానం నుండి ఆసుపత్రి వరకు ఎయిర్ ఇండియా అధికారులు నిరంతరం ప్రయాణీకురాలితో ఉన్నారు. డిశ్చార్జ్ అయ్యే వరకు ఆమె పట్ల పూర్తి శ్రద్ధ వహించారని తెలిపింది. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ బృందం విమానాన్ని తనిఖీ చేసిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ ఘటనపై విమానయాన సంస్థ ప్రయాణికురాలికి క్షమాపణలు చెప్పింది.