దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన కస్టమర్ సపోర్ట్ సర్వీస్‌ను మెరుగుపరిచింది.

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన కస్టమర్ సపోర్ట్ సర్వీస్‌ను మెరుగుపరిచింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టమ్‌లో ఏడు కొత్త ప్రాంతీయ భాషలను చేర్చినట్లు టాటా గ్రూప్ యాజమాన్యం మంగళవారం తెలిపింది. తమ ప్రాంతీయ భాషలో ప్రశ్నలకు సమాధానాలు కోరుకునే ప్రయాణికులకు ఇది సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకూ ఎయిర్ ఇండియా ఐవీఆర్ సిస్టమ్‌లో ప్రయాణికులు ఇంగ్లీషు, హిందీ భాష‌ల‌ను మాత్రమే వినేవారు. కానీ, ఇప్పుడు బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళం, తెలుగులో కూడా త‌మ సందేహాల‌ను అడ‌గ‌గలరు.

IVR సిస్టమ్ మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా వినియోగదారుల‌ భాష ప్రాధాన్యతను స్వయంచాలకంగా గుర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. భాషను మాన్యువల్‌గా ఎంచుకోవలసిన అవసరం కూడా ఉండ‌దు. ఎయిర్‌లైన్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఏడు కొత్త ప్రాంతీయ భాషలలో మద్దతుతో 24x7 అందుబాటులో ఉంటుంది. ఎయిర్ ఇండియా తాజాగా ఐదు కొత్త కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లు ప్రీమియం, తరచుగా ప్రయాణించే ప్రయాణీకులకు సేవ‌లు అందిస్తాయి. ఈ డెస్క్‌ల వద్ద ఎయిర్‌లైన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు రౌండ్-ది-క్లాక్ సహాయాన్ని అందిస్తుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story