తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్(congress) పై విశ్వాసం పెరుగుతుందని ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే(AICC in-charge Manik Rao Thackeray) అన్నారు. ఢిల్లీలో(delhi) ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పాట్నాలో(Patna) విపక్షాల మీటింగ్ జరుగుతుందని.. మరో వైపు ఢిల్లీలో బీఆర్ఎస్(BRS) నేతలు బీజేపీతో(BJP) మంతనాలు జరుపుతున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్(congress) పై విశ్వాసం పెరుగుతుందని ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే(AICC in-charge Manik Rao Thackeray) అన్నారు. ఢిల్లీలో(delhi) ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పాట్నాలో(Patna) విపక్షాల మీటింగ్ జరుగుతుందని.. మరో వైపు ఢిల్లీలో బీఆర్ఎస్(BRS) నేతలు బీజేపీతో(BJP) మంతనాలు జరుపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను కేటీఆర్(KTR) ను కలవడంలో ఆంతర్యం ఏమిటి ? అని ప్రశ్నించారు. బీజేపీతో(BJP) టీఆర్ఎస్(TRS) పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతుందని.. అందుకే బీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులతో భేటీ అవుతున్నారని అన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది.. అరెస్ట్ చెయ్యడం లేదు.. కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చాలా చేరికలు ఉంటాయన్నారు. మాణిక్ రావ్ ఠాక్రే వెంట ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్, అధికార ప్రతినిధి బండి సుధాకర్ ఉన్నారు.