తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ అన్నామలైపై(Anna Malai) అన్నా డీఎంకే పార్టీ గుర్రుగా ఉంది. అన్నామలైకు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి ఆమోదించింది కూడా! అన్నాడీఎంకేకు అంత కోపం ఎందుకు వచ్చిందంటే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే(Anna DMK) అప్పటి అధినేత్రి జయలలితను(Jayalalitha) ఉద్దేశించి అన్నామలై తప్పుడు మాటలు మాట్లాడారట. జయలలితను తెరమీదకు తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. మిత్రధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నదని అన్నారు. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవరాహిత్యంతోనూ, బాధ్యతారాహిత్యంతోనూ చేసినవంటూ తీర్మానంలో పేర్కొన్న అన్నా డీఎంకే గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగ్గా ఉండటం లేదని,
తమిళనాడు బీజేపీ(BJP) చీఫ్ అన్నామలైపై(Anna Malai) అన్నా డీఎంకే పార్టీ గుర్రుగా ఉంది. అన్నామలైకు వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి ఆమోదించింది కూడా! అన్నాడీఎంకేకు అంత కోపం ఎందుకు వచ్చిందంటే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే(AIADMK) అప్పటి అధినేత్రి జయలలితను(Jayalalitha) ఉద్దేశించి అన్నామలై తప్పుడు మాటలు మాట్లాడారట. జయలలితను తెరమీదకు తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. మిత్రధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నదని అన్నారు. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవరాహిత్యంతోనూ, బాధ్యతారాహిత్యంతోనూ చేసినవంటూ తీర్మానంలో పేర్కొన్న అన్నా డీఎంకే గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగ్గా ఉండటం లేదని, అమ్మపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో బీజేపీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది.
నిజానికి మంగళవారం జరిగిన అన్నా డీఎంకే జిల్లా కార్యదర్శులు సమావేశమై కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. కాకపోతే అన్నామలై చేసిన వ్యాఖ్యల కారణంగా చర్చ పక్కకు పోయింది. అన్నామలైకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలిత గురించి తప్పుడు మాటలు మాట్లాడారు అన్నామలై. ఆమెపై నమోదైన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించారు తమిళనాడులో అవినీతి పేరుకుపోయిందని, మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారని అన్నామలై అన్నారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలో అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచిందని, అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుందన్నారు అన్నామలై. ఈ వ్యాఖ్యలు సహజంగానే అన్నాడీఎంకేకు కోపం తెప్పించాయి. క్యాడర్ అయితే మండిపడుతోంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే చేసిన సాయాన్ని పాపం అన్నామలై మర్చిపోయి ఉంటారని క్యాడర్ అంటోంది. ఆ వ్యాఖ్యలను అన్నామలై వెనక్కి తీసుకోకపోతే బీజేపీతో ఫ్రెండ్‌షిప్‌ను కట్ చేసుకుంటామని అన్నాడీఎంకే అంటోంది.
మరోవైపు అన్నాడీఎంకే హెచ్చరికలను బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా అన్నామలై చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. పనిలో పనిగా బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నా డీఎంకే నేత డి.జయకుమార్‌పై విరుచుకుపడుతోంది. ఇంతకీ జయకుమార్(Jayakumar) ఏమన్నారంటే.. 'అసలు అన్నామలై అనే వ్యక్తి ఓ పార్టీ చీఫ్‌గా ఉండేందుకు అర్హుడే కాడు. ఆయన జయలలితపై అలా అనకుండా ఉండాల్సింది. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించడం ఇష్టం లేనట్టుగా ఉంది. కాదంటే మోదీని మళ్లీ ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదేమోనని జయకుమార్ మండిపడ్డారు.