Worldcup finals 2023 : అన్ని దారులు అహ్మదాబాద్వైపే...! అరలక్షకు చేరుకున్న ఫ్లైట్ రేట్లు
అవును ఇప్పుడు అన్ని దారులు అహ్మదాబాద్(Ahmedabad) వైపే! మీరు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకున్నా, రైలు మార్గంలో వెళ్లాలనుకున్నా, విమానంలో వెళ్లాలనుకున్నా ఇప్పుడు కష్టం! ఎందుకంటే మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఎలాగో అలా వెళ్లాలని ప్రయత్నించినా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆ రేట్లు చూస్తే కళ్లు తిరిగి కిందపడతారు
అవును ఇప్పుడు అన్ని దారులు అహ్మదాబాద్(Ahmedabad) వైపే! మీరు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకున్నా, రైలు మార్గంలో వెళ్లాలనుకున్నా, విమానంలో వెళ్లాలనుకున్నా ఇప్పుడు కష్టం! ఎందుకంటే మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఎలాగో అలా వెళ్లాలని ప్రయత్నించినా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆ రేట్లు చూస్తే కళ్లు తిరిగి కిందపడతారు. అది కూడా భరించి అహ్మదాబాద్‌కు వెళ్లారే అనుకోండి.. అక్కడ ఉండేందుకు హోటల్ (hotels) రూములు దొరకడం దుర్లభం. మామూలు హోటల్లోనే రూమ్ రెండు వేల రూపాయలకు చేరింది. ఇక స్టార్ హోటల్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. లక్షల్లో డిమాండ్ ఉంది. ఏదైనా తిందామనుకుంటే వాటి రేట్లు చూస్తే చాలు కడుపు నిండిపోతున్నది. అహ్మదాబాద్‌కు ఎందుకంత డిమాండ్ అంటే ఆదివారం వన్డే ప్రపంచకప్(one day World Cup) తుది పోరుకు వేదికయ్యింది కాబట్టి! ఫైనల్లో ఆస్ట్రేలియాతో (Australia)టీమిండియా(team India) తలపడుతున్నది కాబట్టి!హార్డ్‌కోర్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే మళ్లీ ఈ అవకాశం వస్తుందో రాదో అన్నట్టుగా అహ్మదాబాద్‌కు పరుగులుపెడుతున్నారు. లక్షలు ఖర్చయినా ఫర్వాలేదనుకుంటున్నారు. లక్షమందికి పైగా ప్రత్యక్షంగా చూసే నరేంద్రమోదీ స్టేడియం(narendra Modi stadium) ఇప్పటికే ఫైనల్ పోరుకు సమాయత్తమయ్యింది. 2019లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా మూడు రోజుల కిందట అందుకు ప్రతీకారం తీర్చుకుంది. అలాగే రెండు దశాబ్దాల కిందట ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దొరికింది. ఆస్ట్రేలియాకు తగిన విధంగా బదులిస్తుందనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలా జరగాలని కోరుకుంటున్నారు. మామూలుగా అయితేదేశంలో ఎక్కడి నుంచి అయినా అహ్మదాబాద్‌కు ప్లేన్ టికెట్(flight ticket) అయిదు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది. అదే నెల రోజుల ముందు బుక్ చేసుకుంటే మూడు వేల రూపాయలకే టికెట్ దొరుకుతుంది. కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థల ప్రొమో కోడ్‌లతో మరో అయిదు వందలు తగ్గుతుందంతే! కానీ శుక్రవారంనాడు టికెట్ ధర పాతిక వేల నుంచి 35 వేల మధ్య ఉంది. ఇవాళ, అదే శనివారం బుక్ చేసుకుంటే ఈజీగా అరలక్ష రూపాయలు ఉంటుంది. పలు విమానయాన సంస్థలు ఇదే సువర్ణావకాశమని భావించి ఆ రూట్‌కు ప్రత్యేకంగా ఫ్లైట్లు అందుబాటులో పెడుతున్నాయి. అయినా ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఫైనల్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్‌షోతో ప్రేక్షకులకు నయానందాన్ని కలిగించబోతున్నది.