నరేంద్ర మోదీ స్టేడియంపై(Narendra Modi stadium) దాడి చేస్తామని బెదిరించిన(Threat) వ్యక్తిని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్(Ahmedabad Crime Branch) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు ఇటీవల ఒక మెయిల్(Mail) వచ్చింది. అందులో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
నరేంద్ర మోదీ స్టేడియంపై(Narendra Modi stadium) దాడి చేస్తామని బెదిరించిన(Threat) వ్యక్తిని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్(Ahmedabad Crime Branch) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు ఇటీవల ఒక మెయిల్(Mail) వచ్చింది. అందులో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రస్తుతం ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అక్టోబర్ 14న భారత్(Bharath), పాకిస్థాన్(Pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా ఇక్కడ జరగనుంది. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.
నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అతడిని అరెస్టు చేసినట్లు సంబంధిత పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు స్టేడియంలో పేలుడు జరుగుతుందని పేర్కొంటూ బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు వెల్లడించారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం.. రాజ్‌కోట్ శివార్లలో నివసిస్తున్నాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి తన ఫోన్ నుంచి మెయిల్ పంపాడని అధికారి తెలిపారు. అయితే ఈ మెయిల్‌లో అతని పేరు లేదని వివరించారు. అక్టోబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌కు అదనపు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అహ్మదాబాద్ పోలీసులు గతంలో తెలిపారు.