ఋతుపవనాలు(Mansoon) ఆదివారం ఉదయం ఢిల్లీ(Delhi), ముంబైలోకి(Keerthy) ప్రవేశించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 62 ఏళ్ల తర్వాత ఋతుపవనాలు ఒకేసారి రెండు ప్రాంతాలకు చేరుకున్నాయి. అంతకుముందు జూన్ 21, 1961న, రుతుపవనాలు ఒకే రోజు రెండు ప్రాంతాలలోకి ప్రవేశించాయి. ఇదిలావుంటే.. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ముంబైలో(Mumbai) జేజే ఫ్లైఓవర్(JJ flyover) నీటమునిగింది.
ఋతుపవనాలు(Mansoon) ఆదివారం ఉదయం ఢిల్లీ(Delhi), ముంబైలోకి(Mumbai) ప్రవేశించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 62 ఏళ్ల తర్వాత ఋతుపవనాలు ఒకేసారి రెండు ప్రాంతాలకు చేరుకున్నాయి. అంతకుముందు జూన్ 21, 1961న, రుతుపవనాలు ఒకే రోజు రెండు ప్రాంతాలలోకి ప్రవేశించాయి. ఇదిలావుంటే.. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ముంబైలో(Mumbai) జేజే ఫ్లైఓవర్(JJ flyover) నీటమునిగింది. ఈరోజు నగరంలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్(Yellow alert), కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్(Orange alert) ప్రకటించారు.
వాతావరణ శాఖ(IMD) ప్రకారం.. రాబోయే నాలుగు రోజుల పాటు దేశంలోని దాదాపు 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. వీటిలో జార్ఖండ్(Jharkhand), హిమాచల్(Himachal), జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir), మధ్యప్రదేశ్(Madhya Pradesh), గోవా(Goa), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), అస్సాం(assam), మేఘాలయ(Meghalaya), నాగాలాండ్(Nagaland), మణిపూర్(Manipur), మిజోరం(Mizoram), త్రిపుర(Tripura), ఒడిశా(odisha), పశ్చిమ బెంగాల్(West bengal), ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), హర్యానా(Haryana), పంజాబ్(Punjab), ఢిల్లీ(Delhi), తూర్పు రాజస్థాన్(, గుజరాత్ మధ్య మహారాష్ట్ర, విదర్భ, తీర కర్ణాటక, కేరళ ఉన్నాయి.
ఋతుపవనాలు 7 రోజుల ఆలస్యం తర్వాత దేశంలోకి ప్రవేశించాయి. శనివారం మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్మూ-కాశ్మీర్ లోకి ప్రవేశించాయి. పశ్చిమ కనుమలపై మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో 12 రోజులుగా నిలిచిపోయిన ఋతుపవనాలు.. నాగ్‌పూర్‌కు చేరుకున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లో ఋతుపవనాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా చేరుకుంటాయి. చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఋతుపవనాలు విస్తరించనున్నాయి.