New Continent On earth : వెలుగులోకి ఎనిమిదో ఖండం... పేరు జిలాండియా!
ఖండాలెన్ని(Continents)? అని అడిగితే ఏడు అని చటుక్కున చెప్పేస్తాం! ఇక ముందు ఏడు అని చెప్పకూడదు.. ఎనిమిది అనాలి. ఎందుకంటే ఇప్పుడో కొత్త ఖండం వెలుగులోకి వచ్చింది. దాదాపు 365 సంవత్సరాలుగా ఎవరికీ కనిపించకుండా నీటి అడుగున దాగున్నదట! భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించాడు.
ఖండాలెన్ని(Continents)? అని అడిగితే ఏడు అని చటుక్కున చెప్పేస్తాం! ఇక ముందు ఏడు అని చెప్పకూడదు.. ఎనిమిది అనాలి. ఎందుకంటే ఇప్పుడో కొత్త ఖండం వెలుగులోకి వచ్చింది. దాదాపు 365 సంవత్సరాలుగా ఎవరికీ కనిపించకుండా నీటి అడుగున దాగున్నదట! భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించాడు. ఈ ఖండంలో 94 శాతం భాగం నీటి అడుగునే ఉంది. దీని పేరు జిలాండియా(Zealandia) లేదా టెరియు-ఎ-మౌయి. ఇప్పుడు ప్రపంచపటాన్ని తయారు చేస్తే ఈ కొత్త ఖండాన్ని చేర్చి మరీ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ జిలాండియా ఖండం దాదాపు 1.89 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉందట! మొన్నటి వరకు మనం ఎనిమిదో ఖండంగా చెప్పుకుంటున్న మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ విస్తీర్ణంతో విశాలంగా ఉంది. ఈ ఖండాన్ని వెలికి తీయడానికి చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా కష్టంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఖండానికి సంబంధించి సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలను కూడా చూపుతున్నదని సైంటిస్టులు అంటున్నారు. ఇది న్యూజిలాండ్ పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్ పీఠభూమి సమీపంలో ఉంది. ఈ జిలాండియా ఖండం పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగం అని అంటున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇది సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని కలిపిందని చెబుతున్నారు.