మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) కునో నేషనల్ పార్క్‌లో(Kuno National Park) శుక్రవారం మగ చిరుత(Male Cheetah) మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఉదయం కునో నేషనల్ పార్క్‌లో ఆఫ్రికన్ చిరుత(Africa cheetah) సూరజ్ శవమై కనిపించింది. సూరజ్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. మంగళవారం నాడు కూడా తేజస్ అనే మగ చిరుత చనిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) కునో నేషనల్ పార్క్‌లో(Kuno National Park) శుక్రవారం మగ చిరుత(Male Cheetah) మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఉదయం కునో నేషనల్ పార్క్‌లో ఆఫ్రికన్ చిరుత(Africa cheetah) సూరజ్ శవమై కనిపించింది. సూరజ్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. మంగళవారం నాడు కూడా తేజస్ అనే మగ చిరుత చనిపోయింది. దీంతో కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చిన 20 చిరుతల్లో ఇప్పటివరకు 8 చనిపోయాయి. సూరజ్ చిరుత మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కునోలో ప్రస్తుతం 12 చిరుతలు, ఒక పిల్ల మాత్రమే మిగిలి ఉన్నాయి.
గత 4 నెలల్లో.. 8 చిరుతలు చనిపోయాయి. మొదటి చిరుత మరణం మార్చి 27న నమోదైంది. ఆడ చిరుత సాషా కిడ్నీ వ్యాధితో మరణించింది. దక్షిణాఫ్రికాకు చెందిన మగ చిరుతల్లో ఒకటైన ఉదయ్ ఏప్రిల్‌లో గుండె సంబంధిత సమస్యలతో మరణించింది. తర్వాత మేలో దక్షిణాఫ్రికాకు చెందిన దక్ష అనే ఆడ చిరుత.. రెండు మగ చిరుతలతో జరిగిన పోరాటంలో చనిపోయింది.
అంతకుముందు మార్చిలో సీయాయా (జ్వాల)కి నాలుగు పిల్లలు పుట్టాయి. మేలో రెండు నెలల చిరుత సియాయా పిల్ల బలహీనతతో మరణించింది. అదే నెలలో సీయాయాకు పుట్టిన మరో రెండు చిరుత పిల్లలు మరణించాయి. ఆ తర్వాత తేజస్, ఇప్పుడు సూరజ్ ఇలా మృత్యువాత పడుతున్నాయి. చిరుతల మృతికి గల కారణాలు తెలియరావడం లేదు.