టీ-20 వరల్డ్‌కప్‌లో(T-20 Worldcup) మరో సంచలనం నమోదయ్యింది. న్యూజిలాండ్‌కు అఫ్గానిస్తాన్(Afghanistan ) షాకిచ్చింది. గయానాలో(Guyana) జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై() ఘన విజయం సాధించింది.
టీ-20 వరల్డ్‌కప్‌లో(T-20 Worldcup) మరో సంచలనం నమోదయ్యింది. న్యూజిలాండ్‌కు అఫ్గానిస్తాన్(Afghanistan ) షాకిచ్చింది. గయానాలో(Guyana) జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై() ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ టీమ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో ఘోరంగా విఫలం చెందింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్భాజ్ 56 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 80 పరుగులు చేయగా, ఇబ్రహీం జద్రాన్ 40 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, మాట్ హెన్రి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను అఫ్గానిస్తాన్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. అఫ్గాన్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ పేస్ బౌలర్ ఫజల్హక్ ఫారూఖీ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలా నాలుగు వికెట్లు తీసుకుని విజయంలో కీలకపాత్ర పోషించారు.