మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Devegowda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) చేసిన దగుల్బాజీ పనులకు దేశం యావత్తు నివ్వెరపోయింది. అతగాడి కామలీలతో కూడిన వీడియోలు లీకవ్వడంతో అతడెంత నికృష్ణుడో ప్రజలకు తెలిసిపోయింది. ఇదిలా ఉంటే అడ్వొకెట్ జీ.దెవరాజే గౌడ(Devaraje Gowda) ఇప్పుడు సరికొత్త ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో(DK Shiva kumar) పాటు నలుగురు మంత్రుల పాత్ర ఈ కేసులో ఉన్నట్టు ఆరోపించారు.
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Devegowda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) చేసిన దగుల్బాజీ పనులకు దేశం యావత్తు నివ్వెరపోయింది. అతగాడి కామలీలతో కూడిన వీడియోలు లీకవ్వడంతో అతడెంత నికృష్ణుడో ప్రజలకు తెలిసిపోయింది. ఇదిలా ఉంటే అడ్వొకెట్ జీ.దెవరాజే గౌడ(Devaraje Gowda) ఇప్పుడు సరికొత్త ఆరోపణలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో(DK Shiva kumar) పాటు నలుగురు మంత్రుల పాత్ర ఈ కేసులో ఉన్నట్టు ఆరోపించారు. హసన్ జిల్లా ప్రిజన్స్‌కు ఆయనను తీసుకువెళ్తున్న సమయంలో మీడియాతో ముచ్చటించాడు. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో హెచ్.డి.కుమారస్వామి పేరును ఇరికించేందుకు డి.కె.శివకుమార్ ప్రయత్నించినట్టు దేవరాజే గౌడ అన్నారు. కుమారస్వామిపై(Kumaraswamy) ఆరోపణలు చేస్తే తనకు వంద కోట్ల రూపాయలు ఇస్తానని శివకుమార్ చెప్పినట్టు దేవరాజే గౌడ ఆరోపించారు. ప్రజ్వల్ వీడియోలు లీకేజీ వెనుక కుమారస్వామి ఉన్నట్లు చెప్పేందుకు తనకు డీకే శివకుమార్ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడని, మంత్రులు చాలువరయస్వామి, కృష్ణ బైర గౌడ, ప్రియాంక్ ఖర్గేతో పాటు మరికొంత మంది ఆ ఆఫర్ చేసినట్లు దేవరాజే గౌడ ఆరోపించారు. తనకు అడ్వాన్స్‌గా బౌరింగ్ క్లబ్‌కు అయిదు కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిపారు. దానికి తాను అంగీకరించకపోవడంతో కుట్ర పన్ని తనను ఇరికించినట్లు గౌడ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో డీకే శివకుమార్ ఈ పథకం పన్నినట్టు గౌడ ఆరోపించారు. తనపై లైంగిక వేధింపులు, రేప్ కేసు నమోదు చేశారని, కానీ ఏ ఆధారాలు చిక్కలేదని, ఇప్పుడు పెన్ డ్రైవ్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని దెవరాజే గౌడ తెలిపారు.