ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్పో ప్రయోగించిన ఆదిత్య L1 నేడు గమ్య స్థానాన్ని చేరుకోనుంది. గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను ప్రయోగించిన సంగతి తెలిసందే. ఈ ప్రయోగంతో సూర్యుడి మీద పరిశోధనల కోసం ప్రోబ్‌లను పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, మరికొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్‌లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగంతో ఇస్రో ఆ దేశాల సరసన నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్(Sriharikota Space Station) నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్పో ప్రయోగించిన ఆదిత్య L1 (Aditya L1) నేడు గమ్య స్థానాన్ని చేరుకోనుంది. గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను ప్రయోగించిన సంగతి తెలిసందే. ఈ ప్రయోగంతో సూర్యుడి మీద పరిశోధనల కోసం ప్రోబ్‌లను పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, మరికొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్‌లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L1 ప్రయోగంతో ఇస్రో ఆ దేశాల సరసన నిలిచింది. 2024లో తొలి రోజునే ఎక్స్‌పోశాట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి, శుభారంభం చేసిన ఇస్రో వారం తిరక్కుండానే మరో మైలురాయిని చేరుకోనుంది. మిషన్ చంద్రయాన్-3(Mission Chandrayaan-3) మాదిరిగానే.. ఆదిత్య L1 కూడా భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపహేళిని పెంచుకుని.. సూర్యుడి దిశగా సుదీర్ఘంగా ప్రయాణించి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ 1(Legrange point 1) దగ్గరకు చేరుకుంది. 2024 జనవరి 6 సాయంత్రం లెగ్రాంజ్ పాయింట్ వన్ చుట్టూ ఉన్న శూన్య కక్ష్యలోకి ప్రవేశించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఇక్కడ భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యమవుతాయి. అంటే..ఈ ప్రాంతంలో ఏదైనా వస్తువును ఎలాంటి శక్తి ప్రయోగం లేకుండా స్థిరంగా ఉంచడం సాధ్యపడుతుంది. అందుకే ఇస్రో ఆదిత్య L1ను ఈ పాయింట్ వద్దకు పంపించింది. కానీ అక్కడ కూడా ఆదిత్య L1 మీద చంద్రుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తులు పనిచేస్తాయి. అందుకే ఆదిత్య L1ను ఆ లెగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న శూన్య కక్ష్యలో పరిభ్రమించేలా ప్రవేశపెట్టబోతున్నట్టు ఇస్పో తెలిపింది. ఒక్కసారి ఆదిత్య L1 శూన్య కక్ష్యలోకి చేరిన తర్వాత ఐదేళ్లపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది.

ఇస్పో చెప్పిన దాని ప్రకారం.. సూర్యుడి అధ్యయనానికి భారత్ ప్రయోగించిన తొలి మిషన్ ఆదిత్య L1 (first mission Aditya L1). అయితే ఇది పూర్తిస్థాయి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ కాదు. కానీ.. దీనిని స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ క్లాస్ సోలార్ ప్రోబ్2గా ఇస్రో అభివర్ణించింది. ఇది పూర్తిగా సూర్యుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లే పరిస్థితి ఉండదు. కానీ సూర్యుడికి భూమికి మధ్య దూరంలో వందో వంతు దూరం వరకూ వెళ్లే అవకాశం ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు(ISRO scientists) చెబుతున్న మాట. ఆదిత్య L1లో అమర్చిన ఏడు రకాల పరికరాలు నిత్యం సూర్యుడిపైనే ఉంటూ పరిశోధనలు చేస్తాయి. అలాగే.. ఆదిత్య L1 సూర్యుడి ఉపరితలంపై ఉన్న కరోనాను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆదిత్య L1 తన ప్రయాణంలోనే సూర్యుడి మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపించింది. మరో ఐదేళ్ల పాటు నిరంతరం పరిశోధనలు చేస్తూ, ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపిస్తుంది. ఆదిత్య L1 అందించే సమాచారం భారత్‌తో పాటు మిగిలిన దేశాల అంతరిక్ష సంస్థలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్(ISRO Chairman Somnath)వెల్లడించారు.

Updated On 6 Jan 2024 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story