Adhir Ranjan Chaudhary : స్పీకర్ గారూ సభను నడిపించండి..!
గురువారం లోక్‌సభ(Lok Sabha) కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఓం బిర్లా స్థానంలో రాజేంద్ర అగర్వాల్ స్పీకర్ సీట్‌లో కూర్చున్నారు. ఓం బిర్లా గైర్హాజరు కావడంతో.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహించాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై రాజేంద్ర అగర్వాల్ స్పందిస్తూ.. 'మీ సందేశాన్ని ఛైర్మన్‌కు తెలియజేస్తాను' అని చెప్పారు.
పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమై పన్నెండు రోజులు గడుస్తున్నా.. మణిపూర్(Manipur) అంశంపై రగడ కారణంగా సభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) కూడా ఎంపీల హంగామాతో ఆగ్రహించి లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహించడం లేదు. గురువారం ప్రతిపక్ష ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
గురువారం లోక్‌సభ(Lok Sabha) కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఓం బిర్లా స్థానంలో రాజేంద్ర అగర్వాల్ స్పీకర్ సీట్‌లో కూర్చున్నారు. ఓం బిర్లా గైర్హాజరు కావడంతో.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహించాల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై రాజేంద్ర అగర్వాల్ స్పందిస్తూ.. 'మీ సందేశాన్ని ఛైర్మన్‌కు తెలియజేస్తాను' అని చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో(Nithin Gadkari) పాటు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఎన్కే ప్రేమచంద్రన్, బీఎస్పీకి చెందిన రితేష్ పాండే, బీజేపీకి చెందిన రాజేంద్ర అగర్వాల్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, ఎన్సీపీ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే ఎంపీ కనిమొళి ఈరోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ సమావేశంలో ఎంపీలు సభా కార్యక్రమాలను నిర్వహించాలని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కోపంతో ఉన్న ఓం బిర్లాను సభను నడిపేందుకు ఒప్పించాలని ప్రతిపక్ష ఎంపీలు రాజేంద్ర అగర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన మా సంరక్షకుడై లోక్‌సభను నడిపించాలని కోరారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ అంశంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్ అంశంపై ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటన చేయాలన్న డిమాండ్‌పై విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. అదే సమయంలో.. మణిపూర్‌తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మహిళలపై నేరాలపై చర్చ జరగాలని బీజేపీ(BJP) డిమాండ్ చేస్తోంది. దీంతో రచ్చ కొనసాగుతూ అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష ఎంపీలు సభలో ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. నినాదాలు చేస్తూనే స్పీకర్ సీటు వద్దకు వచ్చారు. స్పీకర్ సీటు వైపు కరపత్రాలు విసిరిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ఇరు పక్షాలు చొరవ తీసుకునేంత వరకూ.. తాను సభకు అధ్యక్షత వహించబోనని ప్రకటించారు.