పాత పార్లమెంట్‌కు వీడ్కోలు పలికి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ్యులంతా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీల చేతికి భారత రాజ్యాంగ ప్రతులను(Indian Constitution Copies) అందించారు. మరి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందో, పొరపాటు దొర్లిందో తెలియదు కానీ భారత రాజ్యాంగం ముందుమాటలో సెక్యూలర్(Secular), సోషలిస్టు(Socialist) అనే పదాలు లేవు.

Indian Constitution Copies
పాత పార్లమెంట్‌కు వీడ్కోలు పలికి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ్యులంతా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీల చేతికి భారత రాజ్యాంగ ప్రతులను(Indian Constitution Copies) అందించారు. మరి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందో, పొరపాటు దొర్లిందో తెలియదు కానీ భారత రాజ్యాంగం ముందుమాటలో సెక్యూలర్(Secular), సోషలిస్టు(Socialist) అనే పదాలు లేవు. ఈ విషయాన్నే కాంగ్రెస్(Congress) నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chouehadhary) ఎత్తి చూపారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నాని చెబుతూ రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం తనకు తెలుసని, కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
